DSP Siraj on fire: ఊహించిందే నిజమైంది. అనుకున్నదే యదార్ధమైంది. ఆదివారం లార్డ్స్ లో నాలుగో రోజు మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు.. పదునైన బంతులు వేసి అదరగొట్టారు..ప్లాట్ పిచ్ పై ఇంగ్లాండ్ బౌలర్లకు చేతకానిది మనవాళ్లు చేసి చూపించారు. ముఖ్యంగా మూడో రోజు చివర్లో నాటికీయ పరిణామాలకు కారణమైన క్రావ్ లే, డకెట్ కు చుక్కలు చూపించారు . క్రావ్ లే వికెట్ ను నితీష్ రెడ్డి పడగొట్టాడు. నితీష్ రెడ్డి వేసిన అద్భుతమైన బంతిని అంచనా వేయలేక యశస్వి జైస్వాల్ కు క్రావ్ లే దొరికిపోయాడు. క్రావ్ లే 22 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు ఉన్నాయి.
Also Read: రహనే మనసులో ఇంతటి బాధ దాగుందా.. మొత్తానికి బయటపెట్టేశాడుగా..
నితీష్ క్రావ్ లీ వికెట్ పడగొట్టిన తర్వాత.. హైదరాబాద్ డిఎస్పి సిరాజ్ సాబ్ ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగానే మైదానంలో కోపంగా ఉండే సిరాజ్.. నాలుగు రోజు అంతకుమించి అనే రేంజ్ లో రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ సమయంలో సిరాజ్ విపరీతమైన కోపంతో కనిపించాడు. క్రికెట్ తీసిన అనంతరం డకెట్ వైపు ఆగ్రహంగా దూసుకుపోయాడు. బకెట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఒకరకంగా భయపెట్టే ప్రయత్నం చేశాడు. సిరాజ్ హావాభావాలకు భయపడిపోయిన డకెట్ ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ వెళ్లిపోయాడు. వాస్తవానికి సిరాజ్ ఈ స్థాయిలో కోపాన్ని ప్రదర్శించడానికి కారణం ఉంది.
మూడవరోజు ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్లు ఎక్కువ చేశారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు పదేపదే బౌలింగ్ కు అంతరాయం కలిగించారు. బంతి తగలకపోయినప్పటికీ గాయం అయినట్టు బిల్డప్ ఇచ్చారు. మైదానంలోకి ఫిజియోలను పిలిపించుచున్నారు దీంతో భారత బౌలర్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంచి ఊపు మీద ఉన్న బుమ్రాను బంతులు వేయకుండా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలోనే మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ ప్లేయర్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్ని నాలుగో రోజు డకెట్ మీద చూపించాడు. ఈ సిరీస్లో డకెట్ మంచి ఊపు మీద ఉన్నాడు. అయితే అతడు 12 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ కథనం రాసే సమయం వరకు ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లకు 98 పరుగులు చేసింది. ఆకాష్ ఒక వికెట్, సిరాజ్ రెండు వికెట్లు, నితీష్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: లార్డ్స్ లో తిప్పేసిన వాషింగ్టన్ సుందర్.. కుప్పకూలిన ఇంగ్లాండ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ముఖ్యంగా దూకుడు మీద ఆడుతున్న బ్రూక్(28) ను ఆకాష్ అవుట్ చేసిన విధానం ఈ మ్యాచ్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. తక్కువ ఎత్తులో బంతిని వేసి బ్రూక్ ను మాయ చేసాడు. దానిని భారీ షాట్ కొట్టడానికి బ్రూక్ ప్రయత్నించాడు. కానీ అది మిస్ అయి వికెట్లను పడగొట్టింది. దీంతో బ్రూక్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.