spot_img
Homeజాతీయ వార్తలుTop 50 Hottest Cities In The World: మండిపోతున్న భారత్.. ప్రపంచంలోనే టాప్ -50...

Top 50 Hottest Cities In The World: మండిపోతున్న భారత్.. ప్రపంచంలోనే టాప్ -50 హాట్ నగరాలు మనవే

Top 50 Hottest Cities In The World: సరిగ్గా మూడు రోజులక్రితం ఉత్తర ప్రదేశ్ లో 46కు మించిన డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సీజన్ లో ఇదే హైయెస్ట్ రికార్డు అనుకుంటే.. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో టెంపరేచర్ రికార్డు అవుతోంది. భయటికి వెళ్లాలంటేనే భయం కలుగుతోంది. ఒకవేళ బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామా అనే ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఎండలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. ఎండలు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నరకం చూస్తున్నారు. డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాలలో తీవ్రమైన అనారోగ్యానికి కూడా గురవుతున్నారు.

శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా సగటున 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు వడగాలులు కూడా తీవ్రంగా వీచాయి. వడదెబ్బ మరణాలు కూడా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ హీట్ నగరాలు కూడా మనదగ్గర నమోదయ్యాయంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వడగాలుల వల్ల శుక్రవారం మధ్యాహ్నం వరకే 40 డిగ్రీలకు మించి టెంపరేచర్ రికార్డయింది.

ఒడిశాలోని బాలన్ గిర్ ప్రాంతంలో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ట్రాకర్ ఈ విషయాన్ని బయట పెట్టింది. చంద్రాపూర్(మహారాష్ట్ర), ప్రయాగ్ రాజ్(ఉత్తరప్రదేశ్), ఛత్తీస్ గఢ్, బిహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదయింది. టాప్ 50 నగరాలలో సగం ఉత్తర ప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే వాయవ్య, మధ్యభారత్ ప్రాంతంలో వడగాలులు చుక్కలు చూపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేసింది.

శుక్రవారం మధ్యాహ్నంవరకు వాతావరణ శాఖ విడుదల చేసిన వరల్డ్ హాట్50 నగరాలలో అన్ని కూడా మనదేశంలోనే ఉన్నాయి. వేడి మాత్రమే కాదు, వడగాలుల తీవ్రత మనదగ్గర అధికంగా ఉంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, పారిశ్రామీకకరణ, చెట్లను నరకడం వంటి పరిణామాలు ఎండ వేడిమి పెరగడానికి దోహదం చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper