India-Russia Relation: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని దేశాలు నష్టపోతున్నాయి. ప్రపంచం మొత్తం యుద్ధం వద్దని సూచిస్తున్నా రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో దాని ఫలితాలు అందరు అనుభవించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగినా అవి సరైన ఫలితం ఇవ్వకపోవడంతో ఇక యుద్ధమే శరణ్యమని రష్యా తన సేనలను ముందుకు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలతోపాటు అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా చాలా దేశాలు రష్యా చర్యలను ఖండిస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి సైతం యుద్ధం వద్దని చెబుతున్నా రష్యా తన వైఖరి మార్చుకోవడం లేదు. దీంతో రష్యాను నిలువరించే క్రమంలో ఆంక్షలు విధిస్తున్నా అది లెక్కచేయడం లేదు. భద్రతామండలిలో ఓటింగ్ పెట్టినా వీటో అధికారం కలిగిన రష్యా దాన్ని వీగిపోయేలా చేసింది. సర్వప్రతినిధి సభ జనరల్ సమావేశంలో కూడా తీర్మానం ప్రవేశపెట్టి అన్ని దేశాలు ఓటేయాల్సిందిగా కోరినా ఇండియా మాత్రం తన వైఖరి వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో భారత్ విధానంపై అమెరికా సహా కొన్ని దేశాలు ఖండిస్తున్నాయి.
Also Read: కాంగ్రెస్ కు లైఫ్ అండ్ డెత్.. రంగంలోకి ట్రబుల్ షూటర్స్
ఎటో ఒక వైపు ఓటు వేయాల్సి ఉన్నా ఇండియా తటస్థ వైఖరి అవలంభించడంపై అగ్ర రాజ్యం అమెరికా గుర్రుగా ఉంది. ఒక వైపు రష్యాతో ఉన్న మైత్రి వల్ల భారత్ ఎటు చెప్పలేకపోతోంది. శాంతి మంత్రమే యుద్ధ నివారణకు మార్గమని సూచిస్తోంది. శాంతి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్న తరుణంలో భారత్ విధానాన్ని అమెరికాకు కంటగింపుగా మారుతోంది. అమెరికాతో కూడా ఇండియాకు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయకపోవడంతో ఆ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇండియాకు అలీన విధానం ఉండటంతో యుద్ధం జరిగే సమయంలో ఏ దేశానికి మద్దతు ఇవ్వదు అలాగని వ్యతిరేకతను వ్యక్తం చేయదు. ఇదే సిద్ధాంతాన్ని భారత్ ఆచరిస్తోంది. కానీ అమెరికా మాత్రం తన మాట వినకుండా ఓటింగ్ లో పాల్గొనకుండా దూరం ఉండటమేమిటని ప్రశ్నిస్తోంది. అమెరికా చెప్పినట్లు వినేందుకు ఇండియా సిద్ధంగా లేదు. ఎందుకంటే విడువుమంటే పాముకు కోపం వద్దంటే కప్పకు కోపం అన్నట్లుగా పరిస్థితి మారింది. రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే దానితో ఉన్న సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగని ఉక్రెయిన్ కు మద్దతు తెలిపినా నష్టమే. అందుకే దేనికి మద్దతు తెలపకుండా తటస్థ వైఖరి పాటిస్తోంది.
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను సైతం పట్టించుకోవడం లేదు. రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అమెరికా భారత్ ను బెదరిస్తున్నా తాము సిద్ధంగా లేమని తప్పించుకుంటోంది. దీంతో మాస్కో దండయాత్రను ఆపాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. మాస్కో పై ఎన్ని ఆంక్షలు విధించినా రష్యా మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఫలితంగా యుద్ధం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఎన్ని ఒత్తిడులు వచ్చిన తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెబుతోంది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగులో 141 దేశాలు మద్దతు పలకగా ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఇండియాతో సహా 35 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉండటం గమనార్హం. దీంతో అమెరికా ఇండియాను మాత్రం ఓటింగ్ దూరంగా ఉండటంలో ఆంతర్యమేమిటని అడుగుతోంది. రష్యా చర్యలను అందరు ఖండిస్తున్నా ఇండియా ఎందుకు నోరు మెదపడం లేదని అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో ఇండియా మాత్రం తన ప్రయోజనాల కోసమే తటస్థ వైఖరి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఎగ్జిట్ పోల్స్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నిజం అవుతాయా?