వాక్సిన్ అందించే శక్తి భారత్ కే ఉందా?

ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించే సత్తా భారత్ కే ఉందనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాయి. తాజాగా మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా భారత్ పైనే ఆశలు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా వాక్సిన్ అందించే సత్తా ఒక్క భారత్ కే ఉందని కితాబిచ్చారు. భారత్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉందని గుర్తుచేశారు. భారతదేశం కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తే ప్రపంచమంతా బతుకుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా […]

Written By: Neelambaram, Updated On : July 17, 2020 2:45 pm
Follow us on


ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించే సత్తా భారత్ కే ఉందనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాయి. తాజాగా మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా భారత్ పైనే ఆశలు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా వాక్సిన్ అందించే సత్తా ఒక్క భారత్ కే ఉందని కితాబిచ్చారు. భారత్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉందని గుర్తుచేశారు. భారతదేశం కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తే ప్రపంచమంతా బతుకుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఎంతో కృషి చేస్తున్నారు. రేయింబవళ్లు భారతీయ సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే గ్లేన్ మార్క్ ఫార్మా కంపెనీ కరోనా డ్రగ్ ను తయారుచేసి కరోనా వ్యాక్సిన్ తయారీపై ఆశలు రేపింది. అదేవిధంగా హెటోరో సంస్థ కరోనాకు ఇంజెక్షన్ తయారుచేసి సైంటిస్టులో జోష్ నింపింది.

దుర్మార్గం.. కరోనాతో వ్యాపారం..!

ఇవన్నీ కూడా ప్రాథమిక కరోనా లక్షణాలున్న వారికి పనిచేస్తాయని ఆ సంస్థలు వెల్లడించాయి. అయితే పూర్తిస్థాయి కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ తయారే మార్గమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు వ్యాక్సిన్ తయారీలో పోటీపడుతున్నాయి. భారత్ సైతం ఒకేసారి జంతువులు, మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేపడుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నవేళ భారత ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ తయారీలో వేగాన్ని పెంచాయి.

భారత్ లో చాలా కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో నిలిచాయి. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ తయారు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. భారత్ ఇప్పటికే అనేక రకాల వైరస్ లకు వ్యాక్సిన్ తయారు చేసి ఎగుమతి చేస్తోంది. వాక్సిన్ తయారు చేసే వ్యాక్సిన్ కంపెనీలు భారత్ లో ఎక్కువగా ఉండటంతో కరోనా వ్యాక్సిన్ కూడా భారత్ నుంచే వస్తుందనే ఆశతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

రాజధానిలో కుప్పలు తెప్పలుగా టు-లెట్లు!

మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. భారత్ వ్యాక్సిన్ తయారుచేస్తే మొత్తం ప్రపంచం బతుకుతుందన్నారు. గతంలోనూ అనేక వ్యాధులకు భారత్ వ్యాక్సిన్ తయారుచేసిందని ఆయన గుర్తుచేశారు. ఇపుడు కూడా కరోనాపై పోరులో భారత్ గెలుస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్ తయారుచేసి ఎగుమతి చేయగల సత్తా ఒక్క భారత్ కే ఉందన్నారు. అన్నిదేశాలు కోరుకుంటున్నట్లు కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ త్వరగా విజయం సాధించి ప్రపంచానికి శుభవార్త చెప్పాలని ఆశిద్దాం.