https://oktelugu.com/

2100 లో తగ్గిపోనున్న భారత్ జనాభా?

2100 కల్లా భారత్ జనాభా తగ్గిపోనుందని ఓ ప్రముఖ అధ్యయనం అంచనా వేసింది. కానీ అప్పటి కల్ల ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. 2017లో 130 కోట్లుగా ఉన్న భారత జనాభా, ఈ శతాబ్దం చివరి నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని పరిశోధకులు అంటున్నారు. 1960లో దేశంలో సంతానోత్పత్తి రేటు 5.91గా ఉంది. ఇప్పుడు అది 2.24కు తగ్గిపోయింది. మిగతా దేశాలు సంతానోత్పత్తి రేట్లను పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నా, […]

Written By: , Updated On : July 17, 2020 / 03:22 PM IST
Follow us on

Indian population

2100 కల్లా భారత్ జనాభా తగ్గిపోనుందని ఓ ప్రముఖ అధ్యయనం అంచనా వేసింది. కానీ అప్పటి కల్ల ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. 2017లో 130 కోట్లుగా ఉన్న భారత జనాభా, ఈ శతాబ్దం చివరి నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని పరిశోధకులు అంటున్నారు.

1960లో దేశంలో సంతానోత్పత్తి రేటు 5.91గా ఉంది. ఇప్పుడు అది 2.24కు తగ్గిపోయింది. మిగతా దేశాలు సంతానోత్పత్తి రేట్లను పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నా, భారత ప్రధాని నరేంద్ర మోదీ చిన్న కుటుంబాలే మేలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

‘‘జనాభా విస్ఫోటనం వల్ల భావి తరాలకు చాలా సమస్యలు వస్తాయి. అయితే, ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారిని తీసుకువచ్చేముందు, వారి అవసరాలు తీర్చగలమా, బాగా చూసుకోగలమా అన్న ఆలోచన చేసే వర్గం ఉంది. వాళ్లు చిన్న కుటుంబాలుగా ఉండటం ద్వారా తమ దేశ భక్తిని చాటుకుంటారు. వాళ్ల నుంచి మిగతా వాళ్లు నేర్చుకోవాలి’’ అని గత ఏడాది మోడీ ఓ ప్రసంగంలో అన్నారు.