IFAD: “దప్పికైన గొంతుకు నీళ్లు ఇవ్వ. ఆకలి గొన్న కడుపుకు పట్టెడన్నం పెట్టు. అప్పుడు నీ పేరు చరితార్థం అవుతుంది” లాటిన్ అమెరికాలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న సామెత ఇది. ఈ సామెతను చేతల్లో నిజం చేసి చూపించింది భారత్. కోవిడ్ టైంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి చరిత్ర సృష్టిస్తే.. ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశం అయినప్పటికీ… 18 దేశాల ఆకలి తీర్చి అన్నపూర్ణగా వినతి కెక్కింది. బెంగాల్ కరువు లాంటి విపత్తు సంభవించిన నేల మీద ముక్కారు పంటలు పండుతున్నాయి.. వరి నుంచి గోధుమల దాకా సస్యములు ఊపిరిలూదుతున్నాయి. ” ప్రపంచ ఆహార వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకు రాగల సత్తా భారత్ సొంతం. ఆ సామర్థ్యం భారతదేశానికి ఉంది. అందుకే యుద్ధానికంటే ఆకలి తీర్చడమే గొప్ప అనుకుంది.. శత్రుదేశం పాకిస్తాన్ తన కీడు కోరుకుంటున్నప్పటికీ.. గతంలో వరదలు సంభవించినప్పుడు ఆహార పదార్థాలు పంపించి తన సేవా నిరతి చాటుకుంది భారత్” అని ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి అధ్యక్షుడు అల్వారో లారియో ప్రశంసించడం భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతోంది.
యుద్ధం వల్ల..
గత ఏడాది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడం వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడింది. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా సంధీ కుదిరించే ప్రయత్నం చేయకపోగా.. తన ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ దేశానికి మద్దతు పలికింది. యూరప్ దేశాలు మొదట్లో ఉక్రెయిన్ కు మద్దతు పలికి తర్వాత సైలెంట్ అయిపోయాయి. దీంతో ఉక్రెయిన్ దేశం ఒంటరి అయిపోయింది. ఇదే అదునుగా రష్యా విరుచుకు పడింది.. ఫలితంగా ఉక్రెయిన్ కకావికలమైంది. మంచి యుద్ధం, చెడ్డ శాంతి ఉండవన్నట్టు.. రష్యా చేసిన యుద్ధం వల్ల ఆ ప్రభావం ప్రపంచం మీద పడింది. యుద్ధానికి సంబంధించి కేటాయింపులను రష్యా పెంచడంతో అది ఆ దేశ ఎగుమతుల మీద పడింది. ఈ దేశం పంపించే ఆహార ధాన్యాల ఆధారంగా మనుగడ కొనసాగించే దేశాల్లో సంక్షోభం ఏర్పడింది. అది తీవ్ర రూపు దాల్చడంతో భారత్ వాటికి ఆపన్న హస్తం అందించాల్సి వచ్చింది.
18 దేశాలకు
యుద్ధం వల్ల చాలా దేశాలు ఆహార సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో భారత్ 18 దేశాలకు 10.8 లక్షల టన్నుల గోధుమలు చేసింది. అక్కడి ప్రజల ఆకలి తెచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలు యుద్ధం అంటూ పెత్తనం కోసం వెంపర్లాడుతుంటే.. భారత్ మాత్రం శాంతిని కోరుకుంది. ప్రజల ఆకలి తీర్చింది. ఇటీవల కాలంలో తృణధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఆహార ఉత్పత్తి విషయంలో ప్రాధాన్యతలు, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతలను పోలి ఉన్నాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో భారత్ సాధించిన నైపుణ్యం గ్లోబల్ సౌత్ లోని ఇతర దేశాలకు సైతం ఉపకరిస్తుందని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. వాతావరణ మార్పులు విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయని, ఇలాంటి సమయంలో తృణధాన్యాల సాగు చేపట్టడం, రైతులను ఆ వైపు మళ్లించడం ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమని జీ20 సమ్మిట్ కు హాజరైన వివిధ దేశాల అధినేతలు కొనియాడుతున్నారు. కరువులను తట్టుకునే శక్తి తృణ ధాన్యాలకు ఉందని, పేదలకు పౌష్టికాహారం అందించాలంటే తృణధాన్యాలతోనే సాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధిలో మాకు సాటి లేదని చెప్పే అమెరికా, ప్రపంచ శక్తిగా ఎదగాలనే కోరిక ఉన్న చైనా.. ప్రపంచంలోని 18 దేశాల ఆకలి తీర్చిన భారత్.. అందుకే భారతదేశాన్ని అన్నపూర్ణ అని పిలుస్తారు.