Truck AC Cabins: ఏసీ లారీలు, ట్రక్కులు.. భారత ప్రభుత్వ సంచలన నిర్ణయం వెనుక కథ!

ఏసీ నిబంధనను కచ్చితం చేయొద్దని నాడు కంపెనీలు కోరాయి. ఏసీ క్యాబిన్లు ఉంటే డ్రైవర్లు నిద్రపోయే అవకాశం ఉంటుందని తెలిపాయి. కానీ వోల్వో ట్రక్, బస్సుల్లో ఏసీలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మార్పులు వచ్చాయి. దేశీయ పరిశ్రమలు కూడా తయారీకి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఏసీ క్యాబిన్లు తప్పనిసరి చేస్తూ ఆమోదం తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : June 20, 2023 11:30 am

Truck AC Cabins

Follow us on

Truck AC Cabins: ఏటా పెరుగుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాతారణ కాలుష్యం కారణంగా భూమిపై వేడి క్రమంగా పెరుగుతోంది. 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాల డ్రైవర్లు ఇంత వేడితోపాటు, వాహనాల ఇంజిన్‌ వేడిలో డ్రైవింగ్‌ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యంబారిన పడుతున్నారు. దీంతో ట్రక్‌ తయారీ కంపెనీలు డ్రైవర్లకు ఏసీ క్యాబిన్లు రూపొందించే ఆలోచన చేస్తున్నాయి 2025 వేసవి నాటికి ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లు తప్పనిసరి అవుతాయని భావిస్తున్నాయి.

నిత్యం 12 గంటల ప్రయాణం..
ట్రక్కు డ్రైవర్లు నిత్యం 11 నుంచి 12 గంటలు వాహనాలు నడుపుతూ ఉంటారు. కఠినమైన పని పరిస్థితులు మరియు రహదారిపై ఎక్కువ గంటలు డ్రైవర్‌ అలసటతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యాధులు బారిన కూడా పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు, ఇంజిన్‌ హీట్‌ తోడవడంతో డ్రైవర్లు కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేసవిలో వామనాలు డ్రైవింగ్‌ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా కంపెనీలు ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తున్నాయి.

ఇప్పటికే వోల్వో తయారీ..
ప్రముఖ ట్రక్‌ తయారీ కంపెనీ వోల్వో, స్కానియా వంటి గ్లోబల్‌ ప్లేయర్‌ కంపెనీలు ఇప్పటికే అతాయధునిక ఎయిర్‌ కండిషన్డ్‌ క్యాబిన్లు తయారు చేస్తున్నాయి. కానీ భారతీయ తయారీ కంపెనీలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏసీ క్యాబిన్ల తయారీపై దృష్టి పెడుతున్నాయి.

కేంద్రం ఆమోదం..
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ల తయారీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ‘మన దేశంలో, కొంతమంది డ్రైవర్లు 12 లేదా 14 గంటలు చక్రాల వెనుక ఉంటారు, ఇతర దేశాల్లో, బస్సు మరియు ట్రక్కు డ్రైవర్లు డ్యూటీలో ఉండటానికి గంటల సంఖ్యపై పరిమితి ఉంది. మా డ్రైవర్లు 43 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో వాహనాలను నడుపుతారు మరియు డ్రైవర్ల పరిస్థితిని మనం ఊహించుకోవాలి. నేను మంత్రి అయిన తర్వాత ఏసీ క్యాబిన్‌ను ప్రవేశపెట్టాలని కోరుకున్నాను. అయితే ఖర్చు పెరుగుతుందని కొందరు వ్యతిరేకించారు. ఈరోజు (సోమవారం), అన్ని ట్రక్‌ క్యాబిన్లు ఏసీ క్యాబిన్లు ఉండాలనే ఫైల్‌పై నేను సంతకం చేశాను’ అని ఒక ఆటోమొబైల్‌ కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తెలిపారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2016లో ఈ చర్యను ప్రతిపాదించింది.

ఫిర్యాదులు..
ఏసీ నిబంధనను కచ్చితం చేయొద్దని నాడు కంపెనీలు కోరాయి. ఏసీ క్యాబిన్లు ఉంటే డ్రైవర్లు నిద్రపోయే అవకాశం ఉంటుందని తెలిపాయి. కానీ వోల్వో ట్రక్, బస్సుల్లో ఏసీలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మార్పులు వచ్చాయి. దేశీయ పరిశ్రమలు కూడా తయారీకి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఏసీ క్యాబిన్లు తప్పనిసరి చేస్తూ ఆమోదం తెలిపింది.

మార్పునకు 18 నెలల సమయం..
దీంతో ఏసీ క్యాబిన్ల తయారీకి ప్రస్తుత పరిశ్రమలను అప్‌గ్రేడ్‌ చేయడానికి 18 నెలల సమయం పడుతుందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. అంటే 2025లో దేశీయ కంపెనీలు ఏసీ క్యాబిన్లు మార్కెట్‌లోకి తెస్తాయని పేర్కొంటున్నారు. అప్పటి వరకు ఆగాల్సిందే అని పేర్కొంటున్నారు. ఒక అంచనా ప్రకారం, ట్రక్కులలో ఏసీ క్యాబిన్లను అందించడానికి అదనంగా రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.