భార‌త్ లో క‌రోనా కౌంట్ 873, మ‌ర‌ణాలు 20

దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 873 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 79 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో 24 గంటల్లో కొత్తగా 149 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్ర‌స్తుతం వివిధ హాస్ప‌ట‌ల్స్ లో 794 మంది చికిత్స పొందుతున్నారు. ఇక దేశం మొత్తం మీద 20 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. […]

Written By: Neelambaram, Updated On : March 28, 2020 5:03 pm
Follow us on

దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 873 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 79 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో 24 గంటల్లో కొత్తగా 149 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్ర‌స్తుతం వివిధ హాస్ప‌ట‌ల్స్ లో 794 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక దేశం మొత్తం మీద 20 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేరళలో కరోనా కేసుల సంఖ్య 176కు చేరింది. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది కరోనా బాధితులున్నారు. శ‌నివారం కొచ్చి హాస్ప‌ట‌ల్ లో చికిత్ప పొందుతూ ఎక‌రు మ‌ర‌ణించారు. కేరళలో ఇది మొదటి మరణం కావడం గమనార్హం.

రాష్ట్రాల వారీగా కేసులు:

అండ‌మాన్ నికోబార్ 2, ఆంధ్ర‌ప‌దేశ్ 15, బీహార్ 9, చండీగ‌డ్ – 7, చ‌త్తీస‌గ‌డ్ – 6, ఢిల్లీ 45, గోవా 3, గుజ‌రాత్ 45, హ‌ర్యానా 44, హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ 3, జ‌మ్మూ – కాశ్మీర్ 19, క‌ర్నాట‌క 58, కేర‌ళ 184, ల‌డ‌క్ 16, మ‌ధ్య ప్ర‌దేశ్ 30, మ‌హారాష్ట్ర 205, మ‌ణిపూర్ 1, మిజోరం 1, ఒడిశా 3, పంజాబ్ 39, పాండీచేరి 1, రాజ‌స్థాన్ 51, త‌మిళ‌నాడు 40, తెలంగాణ 59, ఉత్త‌రాఖండ్ 5, ఉత్త‌ర ప్ర‌దేశ్ – 56, ప‌శ్చిమ బెంగాల్ – 15 ఇలా ఉండగా,కోవిడ్-19 బారిన పడి బాధపడుతున్న వారిని ఉంచడానికి కావలసినన్ని వార్డులు ఆసుపత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో బాధితులతో పాటు వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కూడా అవస్థలు అనుభవిస్తున్నారు. ఈ ఇబ్బందిని తొలగించేందుకు రైల్వే శాఖ నూతన ఆలోచన చేసింది. రైలు బోగీలనే ఐసొలేషన్ వార్డులుగా మలిచింది.

అంతేకాకుండా అందులో కరోనా బాధితులకు చికిత్స చేసే విధంగా అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసింది. దీనికోసం బోగీల్లోని ప్రతి క్యాబిన్‌లో మధ్య బెర్త్‌లతో పాటు ఒకవైపు బెర్త్‌లను తొలగించింది. అలాగే పై బెర్త్‌లను కూడా తీసేయించింది. ప్రస్తుతం ప్రతి క్యాబిన్‌లో ఒకరిని ఉంచే విధంగా రూపొందించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.