రాధిక అప్టే బాలీవుడ్‌తోపాటు పలు తెలుగు సినిమాల్లో నటించింది. బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ మూవీలో నటించింది. బాలయ్యకు జోడీగా మెప్పించింది. అలాగే రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ మూవీలో నటించింది. అయితే ఆమె ముఖానికి మాస్క్ ధరించి హాస్పిటల్లో కూర్చున్న ఫొటోను రాధిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
దీంతో ఈ భామకు కరోనా సోకిందని వదంతులు వ్యాపించాయి. పలువురు సీని ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెట్టడంతో ఆమె స్పందించింది. తాను కరోనా వైరస్ బారిన పడలేదని స్పష్టం చేసింది. కాగా తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లిందో మాత్రం రాధిక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాధిక అప్టే అబద్ధం చెబుతోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.