https://oktelugu.com/

Haryana: హర్యానాలో పేలిన తుపాకీ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టార్గెట్‌గా దుండగుల కాల్పులు.. అసలు ఏమైందంటే?

హర్యానా ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆ రాష్ట్రంలో తుపాకీ పేలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 21, 2024 / 10:59 AM IST

    Haryana

    Follow us on

    Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరో 15 రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. 1,060 మంది 90 సీట్లలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. మరోవైపు మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించాలని అధికార బీజేపీ భావిస్తోంది. మరోవైపు తామే కీలకమవుతామని ఆప్‌ అంటోంది. ఈ నేపథ్యంలో మూడు జాతీయ పార్టీలతోపాటు స్థానిక పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పిస్తున్నాయి. ప్రచారం ప్రశాంతంగా సాగుతున్న వేళ.. హర్యానాలో తుపాకీ పేలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్యంగా కాల్పలు జరిగాయి.

    పంచుకులలో ఘటన..
    హర్యానా రాష్ట్రంలోని పంచుకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రచారం ముగించుకుని వెళ్తుండగా కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే అనుచరుడు గాయపడ్డాడు. రెండుచోట్ల బుల్లెట్‌ గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే అనుచరుడిది నేర ప్రవృత్తి అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ ఘటన వెనుక ముఠా తగాదాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఈసీ సీరియస్‌..
    ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ.. తుపాకీ పేలడంపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై స్పందించిన ఈసీ.. వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీస్‌ అధికారిని ఆదేశించింది. ఈ ఘటనకు కారణంపై ప్రాథమిక విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించింది. అకోటబర్‌ 5న హర్యానాలో ఎన్నికలు జరుగనున్నాయి.