https://oktelugu.com/

PM Narendra Modi: అమెరికా పర్యటనకు నరేంద్ర మోదీ.. ఎందుకోసమంటే.. ప్రధాని హోదాలో అగ్రరాజ్యానికి వెళ్లడం ఇది ఎన్నోసారో తెలుసా?

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోదీ తమ దేశానికి రావొద్దని అమెరికా ఆంక్షలు విధించింది. గోధ్రా అల్లర్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు మోదీకి అదే అగ్రరాజ్యం రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోంది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 21, 2024 / 11:04 AM IST

    PM Narendra Modi

    Follow us on

    PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీ మరోమారు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆదేశ అధినేత జోబైడెన్‌ నేతృత్వంలో విల్మింగ్‌స్టన్‌లో జరుగనున్న నాలుగో క్వాడ్‌ సదస్సులో మోదీ పాల్గొంటారు. అమెరికా పర్యటనకు ముందే.. మోదీ ఓ సందేశం విడుదల చేశారు. ఇండో – పసిపిక్‌ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం క్వాడ్‌ పాటుపడుతోంది. అమెరికా అధినేత జో బైడెన్‌ అధ్యక్షతన నిర్వహించే క్వాడ్‌ సమావేశంలో పాల్గొనబోతున్నా. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ఫ్యూచర్‌ సమ్మిట్‌లో ప్రసంగిస్తాను. అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మోదీ వివిధ సంస్థల సీఈవోలతోనూ భేటీ కానున్నారు. శనివారం తెల్లవారుజామున మోదీ అమెరికా బయల్దేరారు.

    భారత్‌లోనే జరగాలి..
    వాస్తవానికి క్వాడ్‌ సదస్సు ఈ ఏడాది భారత్‌లోనే జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది అమెరికాలో జరగాలి. కానీ, అమెరికా విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది అమెరికాకు అవకాశం ఇచ్చింది భారత్‌. వచ్చే ఏడాది మన దేశంలో నిర్వహిస్తారు. ఈ క్వాడ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. సమావేశం అనంతరం మోదీ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ నేతలతో మోదీ సమావేశం అవుతారు.

    ఐక్య రాజ్య సమితిలో ప్రసంగం..
    ఇక అమెరికాలో మూడు రోజులు పర్యటించనున్న మోదీ.. న్యూయార్‌కలోని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో సమ్మిట్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌లో పాల్గొంటారు. భారత్‌ తరఫుస సందేశం ఇస్తారు. మెరుగైన రేపటి క ఓసం బహుపాక్షిక పరిష్కారాలు అనేది ఈసారి సమ్మిట్‌ థీమ్‌. ఈ సదస్సుల్లో ప్రపంచంలోని అనేక దేశాల నాయకులు పాల్గొననున్నారు.

    ప్రధాని హోదాలో తొమ్మిదోసారి..
    ఇదిలా ఉంటే.. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి పదేళ్లు అయింది. ఇప్పటి వరకు 8సార్లు మోదీ ప్రధాని హోదాలో అమెరికాలో పర్యటించారు. తాజాగా తొమ్మిదోసారి అమెరికా బయల్దేరారు. ఎనిమిదోసారి.. ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రధానులు అమెరికా పర్యటనకు అధికారికంగా వెళ్లారు. వీరిలో మన్‌మోహన్‌సింగ్‌ ఎనిమిదిసార్లు వెళ్లారు. జవహర్‌లాల్‌ నెహ్రూ నాలుగసార్లు అమెరికాలో పర్యటించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా ప్రధానిగా నాలుగసార్లు అమెరికా వెళ్లారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రి హోదాలో మూడుసార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు. తెలుగు నేత పీవీ.నర్సింహారవు ప్రధాని హోదాలో రెండుసార్లు అమెరికా వెళ్లారు. మొరార్జీ దేశాయ్, ఐకే గుజ్రాల్‌ ఒక్కోసారి అమెరికా వెళ్లారు.