Devara(8)
Devara: ప్రస్తుతం ‘దేవర’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 22వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సినిమా మేకర్స్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారనే దానిమీదనే అందరి ఫోకస్ అయితే ఉంటుంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఎవరు గెస్ట్ గా రావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి అలాగే తమ అభిమానుల్లో జోష్ నింపడానికి స్టార్ హీరోల అవసరమైతే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ కూడా ఒక స్టార్ హీరోనే కాబట్టి ఆయన తన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సినిమా మీద అంచనాలను మరింత పెంచడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక తన స్పీచ్ ద్వారానే ప్రేక్షకుల్లో మంచి అంచనాలలైతే పెంచగలిగే కెపాసిటీ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి మాత్రం కొంతమంది చీఫ్ గెస్ట్ లు వస్తున్నారు అంటూ కొన్ని న్యూస్ లు అయితే బయటికి వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏంటి? ఆ చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
ఇక ఈ ఈవెంట్ కి రాజమౌళి మహేష్ బాబు ఇద్దరూ చీఫ్ గెస్ట్ లుగా వస్తున్నారు అంటూ పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక మొన్నటిదాకా ప్రభాస్ కూడా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడనే వార్తలు అయితే వినిపించాయి. కానీ ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబులు మాత్రమే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లుగా వస్తున్నారు అంటూ పలు రకాల ఆసక్తికరమైన వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి వీళ్ళు నిజంగానే వస్తున్నారా లేదా అనే విషయాన్ని దేవర టీమ్ స్పష్టం చేయలేదు.
కాబట్టి ఇది ఒక అంచనగా మాత్రమే భావించాల్సిన అవసరమైతే ఉంది. నిజానికి కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. కాబట్టి ఈ సినిమా ఈవెంట్ కి మహేష్ బాబు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్.. అలాగే కొరటాల శివ మహేష్ బాబు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే.
వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి రెండు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది తెలియాలంటే మాత్రం ఈవెంట్ జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే అని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…