Homeఅంతర్జాతీయంImran Khan- ISI: ఐ ఎస్ ఐ మళ్లీ బుసలు కొడుతోంది: ఈసారి ఇమ్రాన్ ఖాన్...

Imran Khan- ISI: ఐ ఎస్ ఐ మళ్లీ బుసలు కొడుతోంది: ఈసారి ఇమ్రాన్ ఖాన్ ను టార్గెట్ చేసింది

Imran Khan- ISI: పాకిస్తాన్.. పేరుకే ఆదేశంలో అధ్యక్షుడు ఉంటాడు. కానీ తెర వెనుక పెత్తనమంతా ఐఎస్ఐదే. సైన్యమే అన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా నోరు జారి ఒక మాట మాట్లాడితే వారి అంతు చూస్తుంది. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు ఏమి మినహాయింపు కాదు. ఇక పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద గురువారం హత్యాయత్నం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ మీద తుపాకులతో దాడి చేశారు. ఒక వ్యక్తి ఆటోమాటిక్ రైఫిల్ తో కాల్పులు జరపగా రెండో వ్యక్తి అయిన నవేద్[20 ఏళ్లు] పిస్టల్ తో కాల్పులు జరిపాడు. అయితే ఒక బులెట్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ కాలికి తగిలి గాయపడ్డాడు. ఈ కాల్పులలో మరో ఏడుగురు గాయపడగా మరో వ్యక్తి చనిపోయాడు. పిస్టల్ తో కాల్పులు జరిపిన 20 ఏళ్ల నవేద్ ని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పట్టుకోగలిగారు. కానీ ఆటోమాటిక్ రైఫిల్ తో కాల్పులు జరిపిన వ్యక్తి మాత్రం గుంపులో కలిసిపోయి తప్పించుకున్నాడు.

Imran Khan- ISI
Imran Khan

గత వారం రోజులుగా ఇమ్రాన్ఖాన్ రోడ్ షో లు నిర్వహిస్తున్నాడు. ఒక లారీ కంటైనర్ తో కలిపి దానిమీద నుండి రోడ్ షో చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో రాజధాని ఇస్లామాబాద్ చేరుకోవాలి కానీ నిన్న హఠాత్తుగా కాల్పులు జరగడం వల్ల యాత్ర వాయిదా పడ్డది.
గాయపడ్డ ఇమ్రాన్ న్ లాహోర్ లోని ఒక హాస్పిటలలో చేర్పించారు అక్కడ కాలుకి శస్త్ర చికిత్స చేశారు డాక్టర్లు. ప్రాణ భయం లేదు కానీ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీస్కోవాలి అని సూచించారు డాక్టర్లు.

ప్రజల మద్దతు భారీగా ఉంది

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఇమ్రాన్ ఖాన్ కు ప్రజల మద్దతు భారీగా ఉంది. ప్రస్తుతం సైన్యం కూర్చోపెట్టిన షెహబజ్ షరీఫ్ ప్రభుత్వం అక్రమమయినది అని వెంటనే ఎన్నికలు జరిపించాలి అనే డిమాండ్ తో లాహోర్ నుండి ఇస్లామాబాద్ కి రోడ్ ద్వారా యాత్రకి తెర తీశాడు ఇమ్రాన్.
హత్యా యత్నానికి పాలపడ్డ ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఆటోమాటిక్ రైఫిల్ తో కాల్పులు జరిపి పారిపోగా ఇంకొక యువకుడు నవేద్ మాత్రం దొరికిపోయాడు. 20 ఏళ్ల నవేద్ ని ఎందుకు ఇమ్రాన్ ఖాన్ ని చంపాలని చూసావు అని ఆడగగా డానికి నవేద్ బదులిస్తూ ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయాలతో ప్రజలని తప్పు దోవ పట్టిస్తూ మోసం చేస్తున్నాడు అందుకే చంపాలని ప్రయత్నించాను అని బదులు ఇచ్చాడు.

Imran Khan- ISI
Imran Khan- ISI

ఐఎస్ఐ కుట్ర కోణం

20 ఏళ్ల నవేద్ కి ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సిద్ధాంతం ఏమిటో అర్ధం చేసుకోగల వయసు కానీ అనుభవం కానీ లేదు ఉండదు. నవేద్ కి ప్రత్యర్ధి పార్టీ తో సంబంధాలు ఉండి ఉండవచ్చు లేదా డబ్బు ఆశ చూపి పిస్టల్ ని పేల్చడం తో ట్రైనింగ్ ఇచ్చి పంపించి ఉండవచ్చు. ఒక వేళ దొరికిపోతే పోలీసుల ముందు,మీడియా ముందు ఏం చెప్పాలో ముందే ట్రైనింగ్ ఇచ్చి ఉండవచ్చు. ఇక వేల మంది ఇమ్రాన్ మద్దతుదారులు చుట్టూ ఉండగా ఆటోమేటిక్ రైఫిల్ తో కాల్పులు జరిపి తప్పించుకుపోయిన రెండవ వ్యక్తి ఐఎస్ఐ చేత శిక్షణ పొందిన వ్యక్తి. ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ చుట్టూ వేల మంది జనం ఉన్నా వాళ్ళలో వందల సంఖ్యలో ఐఎస్ఐ మనుషులు ఉన్నారు. వాళ్ళ రక్షణ వలయంలో ఉన్న హంతకుడు ఇమ్రాన్ కి దగ్గరగా వచ్చి కాల్పులు జరిపి వెంటనే తన చుట్టూ ఉన్న తన మనుషుల మధ్యలో కలిసిపోయి అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఇది పక్కా ఐఎస్ఐ వ్యూహం !

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version