Homeజాతీయ వార్తలుOyo rooms : ఆగలేక ఓయో రూం లకు వెళ్తున్నారు సరే.. అలా చేస్తూ మీరు...

Oyo rooms : ఆగలేక ఓయో రూం లకు వెళ్తున్నారు సరే.. అలా చేస్తూ మీరు ప్రమాదంలో పడుతున్న సంగతి ఒక్కసారైనా గుర్తించారా?

Oyo rooms : ఇటీవల హైదరాబాదులో ఓ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఓయో రూం కు వెళ్ళింది. అక్కడ సరస సల్లాపాలలో పాల్గొంది. ఆ తర్వాత వాష్ రూమ్ లో పరిశీలించగా సీసీ కెమెరాలు బయటపడ్డాయి.. దీంతో ఒక్కసారిగా ఆ జంట ఆందోళనకు గురైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూసాయి..అక్కడి ఓయో నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. ఇలా వీడియోలను రికార్డు చేస్తున్నారని.. వాటిని పెద్దల చిత్రాలను ప్రదర్శించే వెబ్ సైట్లకు విక్రయిస్తున్నారని తేలింది. దీంతో ఓయో రూం లపై మరోసారి చర్చ మొదలైంది.

వెనుకటి కాలంలో ప్రేమికులు భౌతిక స్పర్శను కోరుకునేవారు కాదు. శారీరక సుఖాన్ని పొందాలని భావించేవారు కాదు. అందువల్లే వారి ప్రేమలు దృఢంగా నిలబడ్డాయి. తర్వాత కాలానికి ఆదర్శంగా మారాయి. ఇప్పుడలా కాదు. ప్రస్తుత స్మార్ట్ కాలంలో.. మనసులు కలవడమే తరువాయి.. తనువులు పెనుగులాడేది ఓయో రూమ్ లలోనే. అపరిమితమైన స్వేచ్ఛ.. చేతిలో డబ్బు.. ఇంకేముంది సుఖం కోసం యువత తహతహలాడుతోంది. మరో మాటకు తావు లేకుండా ఓయో రూమ్ లకు చెక్కేస్తోంది. అయితే యువతలో అందరూ ఇలానే ఉన్నారా అంటే.. అందరూ అని కాదు.. కొంతమంది మాత్రం ఇలానే ఉన్నారు. అలా ఓయో రూమ్ లకి వెళ్లి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు..ఓయో రూమ్ లకు వెళ్లే ఆత్రంలో ఏదైనా చేసేస్తున్నారు. ఫలితంగా లేనిపోని కష్టాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ఓయో రూమ్ లకు వెళ్లేవారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆత్రంలో లేనిపోని తప్పులు చేస్తే తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటారని చెబుతున్నారు.

ఆ తప్పులు చేయకూడదు

ఓయో అనేది ఒక కార్పొరేట్ సంస్థ. దీనికి కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే సొంత హోటల్స్ ఉన్నాయి. మిగతా ప్రాంతాలలో లీజు ప్రాతిపదికన లాడ్జ్ లను నడిపిస్తుంది. దానికి ఎలాగూ ఓయో బ్రాండ్ పేరు ఉంది. పైగా ఎటువంటి నిబంధనలు ఉండవు. దీంతో యువత సులువుగా తమ పని కానిచ్చుకునేందుకు ఓయో రూమ్ లకు వెళ్తుంటారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయం ఉండడంతో ఓయో పంట పండుతోంది. ఏటికేడు భారీగా లాభాలను కళ్లజూస్తోంది. సహజంగా ఓయో రూమ్ లకు వెళ్లేవారు కచ్చితంగా ఐడెంటి ప్రూఫ్ సమర్పించాల్సిందే. అయితే ఇందుకోసం చాలామంది తమ ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు. అయితే ఇలా ఇవ్వడం వల్ల మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందులోనే సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. రూమ్ బుకింగ్ చేసుకునే సమయంలో కస్టమర్లు కచ్చితంగా మాస్క్ డ్ ఆధార్ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆధార్ నెంబర్లోని మొదటి 8 నెంబర్లు కనిపించవు. చివరి 4 అంకెలు మాత్రమే దర్శనమిస్తాయి. అలాంటప్పుడు కస్టమర్ల వివరాలు సురక్షితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రామేశ్వరం కేఫ్ ఘటనలో..

ఇటీవల రామేశ్వరం కేఫ్ లో బాంబు దాడికి పాల్పడిన నిందితులు ఇలా బయట వ్యక్తుల దగ్గర వేరే వాళ్ళ ఆధార్ సమాచారం తీసుకొని సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. పోలీసుల విచారణలో ఇదే విషయాన్ని వారు చెప్పారు. ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నమ్మడానికి లేదు. పైగా వయసు వేడిలో.. సుఖాన్ని పొందాలని తాపత్రయంలో .. చాలామంది యువత తమ ఆధార్ కార్డులను ఓయో రూమ్ నిర్వాహకులకు ఇవ్వడం వల్ల ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఓయో రూమ్ రూములలోకి వెళ్లేవారు జాగ్రత్త వహించాలి. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డు వివరాలను సమర్పించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మన సమాచారం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత నెత్తినోరు కొట్టుకున్నా ఉపయోగముండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version