Team India Vice Captian : సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధృవ్ జురెల్ కు అవకాశం లభించింది.. అయితే ఇదే సమయంలో బిసిసిఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వాస్తవానికి సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టుకు కెప్టెన్ తో పాటు వైస్ కెప్టెన్ కూడా ఉంటాడు. బంగ్లాదేశ్ సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్క్వాడ్ కు వైస్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించలేదు. దీంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.. గత సిరీస్ లకు బుమ్రా వైస్ కెప్టెన్ గా వివరించాడు. అయితే ఈసారి బుమ్రా కు సెలక్షన్ కమిటీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ అనూహ్య మార్పు బుమ్రా అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.. వైస్ కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. అయితే వారితో పోల్చి చూసినప్పటికీ బుమ్రా కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ముగ్గురిలోనూ ఎవరిని వైస్ కెప్టెన్ గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించకపోవడం విశేషం.
తన జట్టును గెలిపించుకున్నాడు.. అయినప్పటికీ..
ఇక దులీప్ ట్రోఫీలో ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న రుతు రాజ్ గైక్వాడ్.. తన టీం ను గెలిపించుకున్నాడు. అయితే అతడికి బంగ్లాదేశ్ సిరీస్ లో ఆడే అవకాశం లభించలేదు. దీంతో సామాజిక మాధ్యమాలలో బీసీసీఐపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సంజు శాంసన్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఇప్పుడు రుతురాజ్ విషయంలోనూ బీసీసీఐ ఇలాగే వ్యవహరిస్తోందని అభిమానులు మండిపడుతున్నారు. ” క్రికెట్లో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అప్పట్లో సంజు.. ఇప్పుడు రుతు రాజ్” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
అద్భుతంగా ఆడినప్పటికీ..
గతంలో సంజు దేశవాళి క్రికెట్లో అద్భుతంగా ఆడాడు. అప్పట్లో అతడికి అవకాశాలు లభిస్తాయని ప్రచారం జరిగింది. కానీ మొండిచేయి చూపారు. చివరికి కొన్ని టోర్నీలో అవకాశం లభించినప్పటికీ సంజు తన సత్తా చాటుకోలేకపోయాడు. ఇటీవల రుతు రాజ్ కు కొన్ని టోర్నీలలో అవకాశాలు వచ్చినట్టే వచ్చి.. చేజారిపోయాయి. అయినప్పటికీ అతడు దులీప్ ట్రోఫీలో స్థిరంగా రాణిస్తున్నాడు. ఏకంగా తన జట్టును గెలిపించుకున్నాడు. అయినప్పటికీ అతడికి బంగ్లా టెస్ట్ తొలి మ్యాచ్ లో ఆడే అవకాశం లభించలేదు. దీనిపై రుతు రాజ్ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్ లో రాజకీయాలకు అంతు లేదని వాపోతున్నారు. అవకాశాలు ఇవ్వకపోతే ఆటగాళ్లు తమ ప్రతిభను ఎలా నిరూపించుకుంటారని సెలక్షన్ కమిటీని ప్రశ్నిస్తున్నారు.