https://oktelugu.com/

Kiran Abbavaram : స్టార్ హీరో చేతిలో పడిన కిరణ్ అబ్బవరం పాన్ ఇండియన్ చిత్రం..ఇక ఆయన జాతకం మారినట్టే!

ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన మలయాళం వెర్షన్ థియేట్రికల్ రైట్స్ మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేసాడు. ఆయన మలయాళం వెర్షన్ ని వరల్డ్ వైడ్ గా తన సంస్థ 'వేఫారెర్ ఫిలిమ్స్' ద్వారా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ ఇవ్వనున్నాడు

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 9:49 pm
    Kiran Abbavaram

    Kiran Abbavaram

    Follow us on

    Kiran Abbavaram : యంగ్ హీరోలలో మంచి టాలెంట్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు..రాణి వారు’ అనే సినిమా ద్వారా ఈయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాకి ఈయన కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ ని ఇటీవలే ఆయన పెళ్లి కూడా చేసుకున్నాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న కిరణ్ అబ్బవరం, రెండవ సినిమా ‘SR కల్యాణ మండపం’ తో మరో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాకి కూడా ఆయన కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. కిరణ్ అబ్బవరం నటనతో పాటుగా, ఆయన డైలాగ్ డెలివరీ, యాస కూడా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అందుకే ఆయనకీ యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలలో సమ్మతమే, వినరో భాగ్యము విష్ణుకథ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ‘మీటర్’,’రూల్స్ రంజన్’ చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే కసి తో ‘క’ అనే పాన్ ఇండియన్ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు.

    సుమారుగా 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి ట్రాక్ లో పడాల్సిన సినిమాతోనే రాబోతున్నావు అంటూ అందరూ ఆయనని ప్రశంసించారు. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన మలయాళం వెర్షన్ థియేట్రికల్ రైట్స్ మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేసాడు. ఆయన మలయాళం వెర్షన్ ని వరల్డ్ వైడ్ గా తన సంస్థ ‘వేఫారెర్ ఫిలిమ్స్’ ద్వారా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ ఇవ్వనున్నాడు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ కొనుగోలు చేసాడు.

    శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులుగా పని చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని, ఏడాది చివరి లోపు కానీ, లేదా సంక్రాంతి కి కానీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం తో పాటుగా, విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పోటీ పడి ఈ సినిమా నిలబడగలదా లేదా అనేది చూడాలి. త్వరలోనే విడుదల తేదీ పై అధికారిక ప్రకటన రానుంది.