https://oktelugu.com/

గుజరాత్‌లో అదే జరిగితే.. మోడీషాల పరువు పోయినట్లే..!

గుజరాత్‌ రాష్ట్రం అంటేనే రాజకీయంగా ప్రధాని మోడీకి అడ్డా. ప్రధాని సొంత రాష్ట్రం కూడా గుజరాత్‌. దశాబ్దాల పాటు తిరుగులేని నేతగా ఆయన అక్కడ చక్రం తిప్పుతున్నారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వెనక్కి తిరిగి చూసుకోకుండా గెలుపు బావుటా ఎగురవేశారు. కానీ.. ఇప్పుడు అక్కడ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటారా..! ప్రధాని సొంత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తన బలాన్ని పెంచుకునే పనిలో పడిందట. Also Read: జగన్ సర్కార్ కు మళ్లీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 26, 2021 11:22 am
    Follow us on

    Gujarat Assembly Elections
    గుజరాత్‌ రాష్ట్రం అంటేనే రాజకీయంగా ప్రధాని మోడీకి అడ్డా. ప్రధాని సొంత రాష్ట్రం కూడా గుజరాత్‌. దశాబ్దాల పాటు తిరుగులేని నేతగా ఆయన అక్కడ చక్రం తిప్పుతున్నారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వెనక్కి తిరిగి చూసుకోకుండా గెలుపు బావుటా ఎగురవేశారు. కానీ.. ఇప్పుడు అక్కడ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటారా..! ప్రధాని సొంత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తన బలాన్ని పెంచుకునే పనిలో పడిందట.

    Also Read: జగన్ సర్కార్ కు మళ్లీ షాకిచ్చిన నిమ్మగడ్డ

    గత ఎన్నికల్లో మంచి పర్‌‌ఫార్మెన్స్ చూపించిన కాంగ్రెస్ ఈసారి గుజరాత్‌లో అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పక తప్పదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ఎన్నికలకు బీజేపీ వెళుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

    గత ఎన్నికల్లోనే బీజేపీ చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు ఫలితాలను సాధించింది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా 77 స్థానాలను కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా అధికారం దక్కలేదు. అయినా బీజేపీకి కాంగ్రెస్ గత ఎన్నికల్లో చుక్కలు చూపించిందనే చెప్పాలి. ఈసారి ఎన్నికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండనున్నాయి. ఇప్పటికే బీజేపీ మూడు దశాబ్దాలకు పైగానే అధికారంలో ఉంది. మోదీ ముఖ్యమంత్రి పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్నాక అక్కడ నాయకత్వ సమస్య ప్రారంభమయింది.

    Also Read: కాపులకు కాపులే శత్రువులా? .. కాపు సంక్షేమ సేన, పవన్ ల కథేంటి?

    మోదీ ఇమేజ్‌తోనే గత ఎన్నికల్లో బీజేపీ ఆ మాత్రం ఫలితాలను సాధించిందని చెప్పాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో సొంత రాష్ట్రంలో ఓటమిని చూపి దేశ వ్యాప్తంగా మోదీ, షాల ఇమేజ్ ను దించాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా ఉంది. దీంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత మోదీ, షా గుజరాత్‌పై ప్రత్యేక దృష్టి పెడతారంటున్నారు. విజయ్ రూపానీని తప్పించి కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. లేకుంటే గుజరాత్ చేజారిపోతుందన్న ఆందోళన బీజేపీ అగ్రనాయకత్వంలో బయలుదేరినట్లే కనిపిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్