వారి వల్లే.. జగన్‌కు ఈ వైఫల్యాలా..!

ఎన్నో పోరాటాలు.. మరెన్నో అవమానాలు.. ఇంకెన్నో బాధలు పడ్డాకనే జగన్‌కు అధికారం లభించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి పోకుండా ధైర్యంగా ముందుకు సాగారు. జగన్ తన టార్గెట్‌ను రీచ్ అయ్యారు. ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లను జగన్ ఎదుర్కొన్నారడంలో అతిశయోక్తి లేదు. ఆయన అధికారంలో లేనప్పటికీ దేనికీ భయపడలేదు. అయితే.. సొంత పాలనలో ఆయన విఫలమవుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తన చుట్టూర ఉన్న కోటరీ మీదనే ఆధారపడి ఉండడం.. ఆయన వద్ద ఉన్న న్యాయ సలహాదారులు సైతం […]

Written By: Srinivas, Updated On : January 26, 2021 11:22 am
Follow us on


ఎన్నో పోరాటాలు.. మరెన్నో అవమానాలు.. ఇంకెన్నో బాధలు పడ్డాకనే జగన్‌కు అధికారం లభించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి పోకుండా ధైర్యంగా ముందుకు సాగారు. జగన్ తన టార్గెట్‌ను రీచ్ అయ్యారు. ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లను జగన్ ఎదుర్కొన్నారడంలో అతిశయోక్తి లేదు. ఆయన అధికారంలో లేనప్పటికీ దేనికీ భయపడలేదు. అయితే.. సొంత పాలనలో ఆయన విఫలమవుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తన చుట్టూర ఉన్న కోటరీ మీదనే ఆధారపడి ఉండడం.. ఆయన వద్ద ఉన్న న్యాయ సలహాదారులు సైతం సరైన గైడెన్స్‌ ఇవ్వకపోవడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: జగన్ సర్కార్ కు మళ్లీ షాకిచ్చిన నిమ్మగడ్డ

జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. కొన్నికేసుల్లో మొట్టికాయలు కూడా పడ్డాయి. మరికొన్ని కేసుల్లో ప్రభుత్వంపై అంక్షితలు పడ్డాయి. అయినా.. జగన్ న్యాయసలహాదారులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాదాపు 70 కేసుల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులొచ్చాయి. అయినా మార్పులేదు. చివరకు పంచాయతీ ఎన్నికలపై మొన్న సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా ఒకరోజు ఆలస్యమవడానికి పిటిషన్‌లో లోపాలేనన్న చర్చ జరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ జగన్ తెగేదాకా లాగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించడం, కనగరాజ్‌ను నియమించడం, మళ్లీ న్యాయస్థానం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులు కావడం వంటివి ఆగ్రహావేశాలతో తీసుకున్న నిర్ణయాలు జగన్ ను దెబ్బతీశాయని చెప్పక తప్పదు. రాజ్యాంగ వ్యవస్థ లతో గేమ్స్ వద్దు అన్న సంకేతాలను పంపింది.

Also Read: కాపులకు కాపులే శత్రువులా? .. కాపు సంక్షేమ సేన, పవన్ ల కథేంటి?

ఎవరికీ దక్కని బంపర్‌‌ మెజార్టీ వైసీపీకి దక్కింది. ఎప్పుడూ లేని విధంగా 151 సీట్లతో జగన్‌కు అధికారం కట్టబెట్టారు ప్రజలు. అనేక వ్యవస్థల ద్వారా విపక్షమే అడ్డుకుంటుందన్నది వాస్తవమే అయినా సహనం వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తాజాతీర్పుతో నీరుగారి పోవాల్సిన అవసరం లేదు. ఎలాగూ ఎన్నికల కమిషన్‌కు అనుకూల తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో కుంగిపోకుండా.. మరెదో ఇగోకు పోకుండా ఎన్నికలు సజావుగా సాగేలా ప్రభుత్వం చూస్తేనే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్