వాహనదారులకు భారీ షాక్.. అక్కడ రూ.100 దాటిన పెట్రోల్..?

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. రవాణా ఛార్జీలు పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, వ్యాట్, డీలర్ కమిషన్, ఇతర పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 89 రూపాయలకు అటూఇటుగా ఉండగా డీజిల్ ధర 83 రూపాయలకు అటూఇటుగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్ లోని పెట్రోల్ బంకులలో […]

Written By: Navya, Updated On : January 26, 2021 11:05 am
Follow us on

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. రవాణా ఛార్జీలు పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, వ్యాట్, డీలర్ కమిషన్, ఇతర పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 89 రూపాయలకు అటూఇటుగా ఉండగా డీజిల్ ధర 83 రూపాయలకు అటూఇటుగా ఉంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్ లోని పెట్రోల్ బంకులలో ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేయడం గమనార్హం. అక్కడ సాధారణ పెట్రోల్ ధర లీటర్ 97.73 రూపాయలుగా ఉండగా ప్రీమియం పెట్రోల్ కు, సాధారణ పెట్రోల్ కు మధ్య వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే మాత్రమే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతూ ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కారణాలు ఏవైనా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర 89.51 రూపాయలుగా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర 83.19 రూపాయలకు చేరింది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 92.29 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 85.03 రూపాయలుగా ఉండటం గమనార్హం.