https://oktelugu.com/

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కోర్టు శిక్ష విధిస్తుందా?

Akbaruddin Owaisi: దేశంలో మతచాందసవాదం పెరుగుతోంది. ఎవరి ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతూ నానా రభస చేస్తున్నారు. దీనికి మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కావడం గమనార్హం. అందరికి సమ్మతంగా మనం పాటించే మతం ఉండాలని చెబుతున్నా దాని తాలూకు జ్వాలలు ఎగిసిపడుతున్న సంఘటనలు అనేకం. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో పాకిస్తాన్ లో క్రికెట్ ఆడితే ఇక్కడ సందడి చేయడం వారికి ఎవరిచ్చిన హక్కు. మనకు రోషం లేదా? మనకు ఆవేశం […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 12, 2022 / 05:02 PM IST
    Follow us on

    Akbaruddin Owaisi: దేశంలో మతచాందసవాదం పెరుగుతోంది. ఎవరి ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతూ నానా రభస చేస్తున్నారు. దీనికి మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కావడం గమనార్హం. అందరికి సమ్మతంగా మనం పాటించే మతం ఉండాలని చెబుతున్నా దాని తాలూకు జ్వాలలు ఎగిసిపడుతున్న సంఘటనలు అనేకం. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో పాకిస్తాన్ లో క్రికెట్ ఆడితే ఇక్కడ సందడి చేయడం వారికి ఎవరిచ్చిన హక్కు. మనకు రోషం లేదా? మనకు ఆవేశం రాదా? మతచాందసవాతు పీచమణిచే విధంగా అందరు ఐక్యమై నడవాల్సిన అవసరం ఉంది.

    Akbaruddin Owaisi

    ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ గ్రౌండ్ లో పదేళ్ల కిందట ఎంఐఎం సభలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. రెండు మతాల మధ్య వైరం పెంచేలా చేసిన మాటలతో యావత్తు దేశమే నివ్వెరపోయింది. మేం 25 కోట్లు ఉన్నాం. మీరు వంద కోట్టున్నారు. మాకు ఓ పదిహేను నిమిషాలు సమయమిస్తే మొత్తం ఖతం చేస్తామని చెప్పడం గమనార్హం. దీంతో ఐపీసీ 120బీ, 153ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు కేను నమోదు చేశారు. దీంతో అక్బరుద్దీన్ అరెస్టయి జైల్లో 40 రోజులు ఉండి బయటకు వచ్చాడు.

    మత చాందసవాదంతో పిచ్చి మాటలు మాట్లాడుతూ చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకునే వ్యక్తులతో ఇంకెంత కాలం సహనంగా ఉండాలి. మనలో ఆవేశం లేదా? మనమే ఓ పదిహేను నిమిషాలు అన్ని పక్కనపెడితే వారుంటారా? ఇలా మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశంలో అలజడులు సృష్టించడం కొత్తేమీ కాదు. అందుకే వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలని అప్పట్లో మన నేతాజీ చేసిన సూచనను ఎవరు వినకపోవడం వల్లే ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి.

    Akbaruddin Owaisi

    ఈ కేసు విచారణ కొనసాగుతోంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు తీర్పు బుధవారానికి వాయిదా వేసింది. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు ఎలాంటి శిక్ష పడుతుంది? కోర్టు కఠినంగా వ్యవహరిస్తుందా? లేక చిన్నపాటి శిక్షతో వదిలేస్తుందా అనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని దేశభక్తులు కోరుతున్నారు.

    Tags