Homeజాతీయ వార్తలుMulayam Singh Yadav Second Wife: ములాయం సింగ్ రెండో భార్య వెలుగులోకి వచ్చింది ఎప్పుడంటే?

Mulayam Singh Yadav Second Wife: ములాయం సింగ్ రెండో భార్య వెలుగులోకి వచ్చింది ఎప్పుడంటే?

Mulayam Singh Yadav Second Wife: ములాయం సింగ్ రాజకీయ జీవితంలో ఎన్నోఅటుపోట్లను ఎదుర్కొన్నారు. పడిపోయిన ప్రతిసారి తనకు తాను నిరూపించుకొని నిలబడ్డారు. అందుకే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలను అధిగమించి ఉత్తరప్రదేశ్ పీఠం అందుకున్నారు. ఎన్నో రాజకీయ సంక్షోభాలను సైతం చవిచూశారు. కష్ట నష్టాలను ఎదుర్కొని యూపీలో సమాజ్ వాది పార్టీని నిలబెట్టారు. అటు వ్యక్తిగత జీవితంలో సైతం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన రెండో వివాహం గురించి చాలా రోజులు గోప్యత పాటించారు. 90వ దశకంలో పెళ్లి చేసుకుంటే.. అది 2007లో బయటపడింది. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో ఆయన రెండో వివాహం గురించి ప్రస్తావించారు. రెండో భార్య పేరు సాధనా గుప్తాగా బయట ప్రపంచానికి వెల్లడించారు.

Mulayam Singh Yadav Second Wife
Mulayam Singh Yadav Second Wife

ములాయంసింగ్ యాదవ్ మొదటి భార్య పేరు మాలతీదేవి. 2003లో ఆమె అనారోగ్యంతో కన్నుముశారు. ఆమె కుమారుడే అఖిలేష్ యాదవ్. అయితే అప్పటికే మూలయం రెండో వివాహం చేసుకున్నారు. ములాయం మాతృమూర్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా ఓ నర్సు ఒక ఇంజక్షన్ కు బదులు.. మరో ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానిని సాధానా గుప్తా చూసి అడ్డుకున్నారు. తల్లిని ప్రాణాపాయం నుంచి తప్పించిన సాధానా గుప్తాపై ములాయం అభిమానాన్ని పెంచుకున్నారు. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ వైవాహికంగా దగ్గరయ్యారు. కానీ బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. అయితే అప్పటికే సాధానా గుప్తాకు ఓ కిరణా షాపు యజమానితో వివాహం జరిగింది. అతడి నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్న తరువాతే సాధానా గుప్తాను వివాహం చేసుకున్నట్టు తన బయోగ్రఫీలో ములాయం తన బయోగ్రఫీలో వెల్లడించారు. ములాయం, సాధానా గుప్తాలకు ప్రతీక్ యాదవ్ అనే కుమారుడు ఉన్నారు. 1994లో పాఠశాల రికార్డులో తన తండ్రి పేరు ములాయం సింగ్ యాదవ్ గా పేర్కొన్న అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు. 2007లో ములాయం వెల్లడించే వరకూ బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియదు.

Mulayam Singh Yadav Second Wife
Mulayam Singh Yadav Second Wife

ములాయం కంటే ఆయన రెండో భార్య సాధానా గుప్తా 20 సంవత్సరాలు చిన్నకావడం గమనార్హం. సాధానా గుప్తా అనారోగ్యంతో ఈ ఏడాది జూలైలో గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇప్పుడు ములాయం సింగ్ కూడా అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. అయితే తన వైవాహిక జీవితాన్ని గోప్యత పాటించడంలో మూలయం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి కోర్టు కేసు రీత్యా బయటకు వెల్లడించక తప్పలేదు. వైవాహిక జీవితపరంగా ఎన్నోరకాల ఒత్తిళ్ళకు గురైనట్టు ములాయం తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకొచ్చారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular