Ramcharan- Mahesh Babu: ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కుటుంబానికి ఎంత విచారకరమైన ఏడాది అనేది మన అందరికి తెలిసిందే..ఒకే ఏడాది మహేష్ బాబు గారికి కృష్ణ గారికి మరియు కుటుంబసభ్యులకు ఎంతో ఇష్టమైన రమేష్ బాబు గారు మరియు ఇందిరా దేవి గారి మరణించడం ఆ కుటంబానికి తీరని లోటు అనే చెప్పొచ్చు..ఇక ఇందిరా దేవి గారు చనిపోయిన తర్వాత కుటుంబం మొత్తం ఎలా శోకసంద్రం లో మునిగిపోయిందో సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియోలలో మన చూడొచ్చు..ఇప్పటికి ఇందిరా దేవి గారు చనిపోయాయి 11 రోజులు అవ్వడం తో నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు టాలీవుడ్ సెలబ్రిటీస్ కి దినం విందు ఇచ్చారు..ఈ విందుకి మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యాడు..కృష్ణ మరియు మహేష్ బాబు గార్లను వినయపూర్వకంగా కలుసుకొని తమ సంతాపం ని వ్యక్తపరిచారు..దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇందిరా దేవి గారి చనిపోయిన రోజున రామ్ చరణ్ షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల చివరి చూపు చూడలేకపోయారు..అందుకే ఈ కార్యక్రమానికి హాజరు అయ్యి తన సంతాపం ని వ్యక్తపరిచారు..మహేష్ బాబు మరియు కృష్ణ గారి తో వారి కుటుంబ సభ్యులతో చిరంజీవి గారికి మరియు రామ్ చరణ్ గారికి ఎంతో సన్నిహిత్య సంబంధం ఉంది..ఇండస్ట్రీ నుండి అంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ మహేష్ బాబు ని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదు.

కానీ మెగా ఫామిలీ నుండి మాత్రం చిరంజీవి గారు మరియు, నిన్న రామ్ చరణ్ ఉపాసన కొణిదెల కూడా హాజరయ్యారు..వీళ్ళు కాకుండా ఇప్పటి వరుకు రానా దగ్గుపాటి,త్రివిక్రమ్ ,విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ , మోహన్ బాబు మరియు అతని కుటుంబ సభ్యులు మాత్రమే మహేష్ బాబు గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా కలిసి సంతాపం ని వ్యక్తపరిచారు..ఇక మిగతావాళ్ళెవ్వరూ కూడా మహేష్ బాబు కుటుంబాన్ని ప్రత్యేకంగా కలిసి సంతాపం ని వ్యక్తపరచడం మనం చూడలేదు.