Divi Vadthya: ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ కి వచ్చి..అవకాశాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా కృష్ణ నగర్ చుట్టూ ఏళ్ళ తరబడి తిరుగుతూ తమ కెరీర్స్ ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..ఎవరో ఒకరిద్దరి తప్ప బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం అంటే సాహసం అనే చెప్పాలి..బిగ్ బాస్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దివి కూడా ఈ కోవకే చెందిన వ్యక్తి అట..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేముందు సినిమాల్లో అవకాశాల కోసం ఈమె అప్పట్లో వందకి పైగా ఆడిషన్స్ ఇచ్చిందట..కానీ ఒక్క ఆడిషన్ లో కూడా ఆమె సెలెక్ట్ కాలేకపోయిందట..ఒకటి రెండు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించే అవకాశం తప్ప,బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేముందు ఒక్క గుర్తుండిపోయ్యే పాత్ర కూడా ఆమెకి పడలేదు..ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటనకి ప్రాధాన్యమున్న పాత్ర చేసి మంచి మార్కులు కొట్టేసింది దివి.

బిగ్ బాస్ 4 తెలుగు లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి కి మంచి పాపులారిటీ వచ్చింది..ముఖ్యంగా యువత ని ఈమె ఎక్కువగా ఆకర్షించింది..కానీ హౌస్ లోకి వచ్చిన 50 రోజులకే ఈమె ఎలిమినేట్ అయ్యింది..అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధి గా హాజరైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎపిసోడ్ లో చిరంజీవి గారు ఇంటి సభ్యులందరితో సరదాగా ముచ్చటించారు..ఆ సమయం లోనే దివి తో కూడా మాట్లాడుతూ ‘కచ్చితంగా నా సినిమాలో నీకు అవకాశం ఇస్తాను’ అని మాట ఇచ్చారు మెగాస్టార్..ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆమెకి గాడ్ ఫాదర్ సినిమాలో అవకాశం ఇచ్చాడు..అది కూడా మాములు పాత్ర కాదు..దివి కి ఇది కెరీర్ బెస్ట్ రోల్ అనే చెప్పొచ్చు.

ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా మారిపొయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి..అలా ఇన్నేళ్ల తన నిరీక్షణకు మంచి ఫలితం దక్కింది..చిరంజీవి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు అంటూ దివి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.