Holi : దేశ వ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు అంబారాన్ని అంటుతున్నాయి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అంతా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక హోలీకా దహనం తర్వాత హోలీ పండగ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఢమరుకాలు మోగిస్తూ జనాలు సందడి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు రోడ్ల మీదకు రావడంతో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. పండుగ రోజు రంగులతోనే కాకుండా డేజే సాంగ్స్, రెయిన్ డ్యాన్స్ లతో ఎంజాయ్ చేస్తుంటారు.
హోలీ అనేది మానవ సంబంధాలకు ఆనందాలను జోడించడం కూడా. ఒకరికొకరు స్వీట్లను తినిపించుకుంటూ విషెష్ చెప్పుకుంటారు. నేటికీ గత సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ప్రజలు హోలీ నాడు చక్కెర మిఠాయిలను సమర్పించే సంప్రదాయాన్ని గౌరవిస్తారు. అయితే, గతంతో పోలిస్తే దీని వినియోగం తగ్గిపోయింది. వీటిని తయారు చేయడం దాదాపు మానేశారు.చక్కెర దండలను చిన్నపిల్లల మెడలో వేయడం ఓ సరదా. కొత్త అల్లుళ్లకు అత్తగారింటి వాళ్లు మర్యాదలు చేస్తుంటారు.
Also Read : హోలీ రంగులు చేతుల నుంచి పోవడం లేదా? ఇలా చేయండి ఎంత మొండి మరకలు అయినా సరే పోవాల్సిందే..
హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం సర్వసాధారణం. అయితే ఇదే అదునుగా కొందరు ఆకతాయి తనాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది హద్దుల్లో ఉంటే ఫర్వాలేదు. కానీ పరిధి దాటితేనే సమస్య. ఎదురి వారు ఇష్టపడితేనే వారి మీద రంగులు చల్లండి. పండుగ పేరుతో ఇతరుల మీద ఇష్టం వచ్చినట్లు తాకి రంగులను పూస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలియని వారి విషయంలో హుందాగా వ్యవహరించాలని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు.
హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్లో పలు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా భద్రత బలగాల మధ్య పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ లో హోలీ వేడుకలపై పోలీసు ఆంక్షలు విధించారు. పర్మీషన్ లేకుండా ఎవరి మీద రంగులు చల్లవద్దంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read : ఆ ప్రాంతాల్లో హోలీ ఆడటం ఒక శాపం.. ఇప్పటికీ హోలీ ఆడని ప్రజలు కూడా ఉన్నారు తెలుసా?