Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయనకు దేశవిదేశాల్లో అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులకు పండుగే.అలాంటి ఆయన నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పివిఆర్ ఐనాక్స్ ‘అమీర్ ఖాన్ : సినిమా కా జాదూగర్’ అనే ప్రోగ్రాం నిర్వహించారు. నిర్వహించనుంది. ఈ సందర్భంగా అమీర్ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తిక విషయాలను వెల్లడించారు.
Also Read : 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్… ఆమెతో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించిన అమిర్ ఖాన్! ఎవరీ గౌరీ స్ప్రాట్
అయితే అమీర్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం వార్తలో నిలిచారు. బెంగుళూరుకు చెందిన ఓ బిడ్డ తల్లి అయిన గౌరీ స్ప్రత్‌తో పాతికేళ్లుగా స్నేహాన్ని కలిగి ఉన్నానని తెలిపారు. గతేడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అమీర్ వెల్లడించారు. తన 60వ బర్త్ డే వేడుకను పురస్కరించుకుని ఆయన మీడియాతో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘మహాభారతం’, బాలీవుడ్ హీరో సల్మాన్, షారూక్ తో స్నేహం, గౌరీతో డేటింగ్ తదితర అంశాలపై ముచ్చటించారు.
ముఖ్యంగా గౌరీతో తనకు గత పాతికేళ్లుగా స్నేహం ఉందన్నారు. గతేడాదిగా తామిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. బెంగుళూరుకు చెందిన ఆమె తన ప్రొడక్షన్ హౌస్‌లో పని చేస్తున్నారంటూ వివరించారు. ఇప్పటికే గౌరీకి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు తెలిపాడు. 2021లో తన భార్య కిరణ్ రావుతో అమీర్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన రీనా దత్తాను పెళ్లి చేసుకుని ఇద్దరూ విడిపోయారు.
గతంలో అమీర్ ఖాన్ మమతా కులకర్ణితో కూడా డేటింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆ సమయంలో అమీర్ వివాహం చేసుకున్నందున ఆ సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. హీరోయిన్ పూజా భట్ తో యవ్వారం నడిపారని ప్రచారం జరిగింది. అలాగే బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ తో కూడా సంబంధం ఉందన్న పుకార్లు వ్యాపించాయి. జెస్సికాతో ప్రేమ వ్యవహారం సమయంలో అమీర్ చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా తన బిడ్డకు తానే తండ్రి అని పేర్కొంది.రాచెల్ షెల్లీతో కూడా ఎఫైర్ నడిపినట్లు గాసిప్స్ వ్యాపించాయి. వారు లగాన్‌లో కలిసి పనిచేశారు. కానీ ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు ఇది కాకుండా, నటి ఫాతిమా సనా షేక్‌తో అమీర్ ఖాన్ ప్రేమ వ్యవహారం కూడా వార్తల్లో నిలిచింది. ఫాతిమా ఆమిర్ కంటే 26 సంవత్సరాలు చిన్నది. వారిద్దరూ కలిసి ‘దంగల్’ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఫాతిమా ఆయన కూతురి పాత్రను పోషించింది. ఆయన దీనిపై అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు.
Also Read : అమీర్ ఖాన్ రికార్డ్ ను కొట్టడం తెలుగు స్టార్ హీరోల వల్ల కావడం లేడా..?
ఇక పోతే తన డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారతం’ స్క్రిప్టు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. స్క్రిప్టు వర్క్ మాత్రమే మొదలైనట్లు.. ఇందుకోసం ఓ టీం రెడీ చేసే పనిలో ఉన్నట్లు వివరించాడు. ఈ భారీ ప్రాజెక్టు కోసం తామెన్నో విషయాల గురించి అన్వేషిస్తున్నట్లు, ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఇకపోతే సల్మాన్, షారూక్ ఖాన్‌లతో మంచి స్నేహబంధం ఉందన్నారు. బుధవారం కూడా వారిద్దరిని కలిసినట్లు ప్రకటించారు. తమపై మీడియాలో వచ్చే గాసిప్స్‌పైనే ప్రధానంగా తమ మధ్య చర్చ జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆయన బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు, డైరెక్టర్ గా రాణించారు. కానీ వైవాహిక జీవితం కంటే కూడా ఈ ఎఫైర్లతో ఎక్కువ పాపులర్ అయ్యారు.
