DMK : డీఎంకే.. ఒకనాటి జస్టిస్ పార్టీ యొక్క ఆధునిక రూపం.. బ్రిటీష్ వారికి ఇది తొత్తుగా ఉండేది. దాన్ని చేజిక్కించుకున్న పెరియార్.. భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉండాలని అనుకున్నాడు. జిన్నాకు లెటర్స్ రాశాడు. మద్దతు కోరాడు. నాటి పెరియార్ ఆలోచనలే నేడు డీఎంకేకు మార్గదర్శకాలుగా మారాయి.
డీఎంకే చేష్టలు వికృత చేష్టలుగా మారాయి. సంవత్సరంలో ఎన్నికలున్నాయి. హీరో విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు. ఎవరి ఓట్లు చీలుస్తాడని చూస్తే ‘ఎన్డీఏ’ ఓట్లునే చీల్చుతాడని అర్థం అవుతోంది. డీఎంకేకు బీటీంగ విజయ్ పార్టీ సిద్ధాంతంగా కనిపిస్తోంది. పెరియార్ ను ఆరాధ్య దైవంగా విజయ్ పెట్టుకున్నాడు.
నిన్న ఈడీ లిక్కర్ స్కాం తమిళనాడులో జరిగిందని.. 1000 కోట్ల స్కాం జరిగిందని తేల్చింది. దీన్ని డైవర్ట్ చేయడానికి డీఎంకే రకరకాల ప్లాన్లు చేస్తోంది. హిందీ భాష మాధ్యమ వివాదం తీసుకొచ్చారు.. రెండోది డీలిమిటీషన్.. ఎంపీల సీట్లు తగ్గుతాయని లొల్లి చేస్తున్నారు. ఇదంతా దృష్టి మరల్చడానికి ఏదో ఒక లొల్లి చేస్తున్నారు.
ఇప్పుడు రూపాయి సింబల్ హిందీలో ఉందని.. దానికి తాము వ్యతిరేకం అంటున్నారు.
డీఎంకే వికృత చేష్టలతో ఇరకాటంలో ఇండీ కూటమిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.