Holi : హోలీ రోజున రంగులతో ఆడుకోవడం అదొక రకమైన సరదా కదా. ఈ రోజు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కలర్స్, గుడ్లు, టమాటాలు ఇలా ఏది పడితే దానితోనే ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు ప్రజలు. అయితే హోలీ తర్వాత ఆ రసాయన రంగులను చేతి నుంచి తొలగించడం మాత్రం చాలా కష్టమైన పనే. మీరు మొండి హోలీ రంగులను ఎలా తొలగించాలి అని తెగ ఆలోచిస్తున్నారా? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చర్మానికి హాని కలిగించకుండా, ఎటువంటి రసాయనాలు లేకుండా చర్మం నుంచి రంగులను తొలగించడానికి ఇప్పుడు మేము సింపుల్ టిప్స్ చెబుతాము కదా. ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించి, నిమిషాల్లో హోలీ రంగులను శుభ్రం చేసుకోండి. దీని వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది కూడా.
Also Read : మీకు కారు ఉందా? అయితే హోలీ పండుగ రోజు ఇలా చేయండి..
కావలసినవి:
షాంపూ – 1 ప్యాకెట్
ఈనో – 1 ప్యాకెట్
నిమ్మకాయ – 1 ముక్క
ఒక గిన్నెలో షాంపూ, ఈనో, నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని శాశ్వత హోలీ రంగు ఉన్న ప్రదేశాలలో పూయండి. ఇప్పుడు కొంచెం నీరు కలిపి చర్మంపై సున్నితంగా రుద్దండి. కొన్ని నిమిషాల్లోనే చర్మం పూర్తిగా శుభ్రంగా మారుతుంది. ఇక మీకు శరీరం మొత్తం కూడా రంగులు అంటుకుంటే ఇలాగే మొత్తం పెట్టుకొని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మంచి స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత చర్మానికి తేమను అందించడానికి కొబ్బరి నూనె రాసి, మళ్ళీ స్నానం చేయండి.
ఇందులో ఉండే షాంపూ చర్మంపై పేరుకుపోయిన మురికి, రంగును తొలగించడంలో సహాయపడుతుంది. ఈనోలో ఉండే బేకింగ్ సోడా చర్మం నుంచి రంగును త్వరగా తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇక నిమ్మకాయ సహజ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. రంగులను తేలికపరచడంలో సహాయపడుతుంది.
హోలీ ఆడే ముందు ఆవాలు లేదా కొబ్బరి నూనెను రాయండి. తద్వారా రంగు సులభంగా తొలగిపోతుంది. సింథటిక్, కఠినమైన రసాయన రంగులను నివారించండి. సేంద్రీయ రంగులను ఉపయోగించండి. రంగు తొలగించిన తర్వాత, చర్మం తేమగా ఉండేలా అలోవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్‌ను చర్మంపై రాయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రంగులను పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఆడుకోవచ్చు. ఎందుకంటే తర్వాత మీ రంగు నిమిషాల్లో శుభ్రం అవుతుంది. ఈ సులభమైన ఇంటి నివారణను ప్రయత్నించండి. మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోండి.
Also Read : రంగుల పండుగపై మళ్లీ కన్‌ఫ్యూజన్.. ఏరోజు జరుపుకోవాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే..