
మంత్రి కొడాలి నాని రెచ్చిపోయాడు. ఉదాహరణగా చెప్పబోయి ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత లోకేష్ కు కౌంటర్ ఇవ్వబోయి నాని చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్న సమయంలో ప్రతిపక్ష టీడీపీ ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రంలోని బీజేపీని అనకుండా ఏపీలోని జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడాన్ని మంత్రి కొడాలి నాని తప్పుపట్టారు. లోకేష్ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే టీడీపీ నేత లోకేష్ కు దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మోడీ కాలర్ పట్టుకో అంటూ మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. మోడీని అనలేక జగన్ ను అంటారా అంటూ విరుచుకుపడ్డారు. ‘మీకు దైర్యం ఉంటే ప్రధాని మోడీని ప్రశ్నించాలని’ టీడీపీ నేత లోకేష్ ను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మేరు ఊరుకోమని ప్రధానిని హెచ్చరించాలని సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి కొడాలినాని స్పష్టం చేశారు… ఆ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేయకుండా మోడీని బీజేపీని నిలదీయాలని కోరారు.
https://www.youtube.com/watch?v=8kh0kFreOeE&t=11s