
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. గ్రామ్ ఉజాలా పథకం పేరుతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చనుంది. పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ రాజ్ కుమార్ ఈ పథకం కింద ఎల్‌ఈడీ బల్బులను తక్కువ ధరకే అందిస్తూ ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కేవలం 10 రూపాయలకే ఎల్ఈడీ బల్బులు లభిస్తాయి.
ప్రభుత్వ రంగానికి చెందిన కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ ఈ పథకం యొక్క నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ సంస్థ అనుబంధ సంస్థ అయిన ఈ సంస్థ బల్బులను ఒకేసారి అందించకుండా విడతల వారీగా అందిస్తుంది. 7 వాట్, 12 వాట్ బల్బులను ప్రజలు సులభంగా కొనుగోలు చేయవచ్చు. మొదట ఎంపిక చేసిన రాష్ట్రాల్లో బల్బుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఎల్‌ఈడీ బల్బులకు ఏకంగా మూడు సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఏపీలోని విజయవాడలో మొదటి విడత బల్బుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. పని చేయని బల్బులను వెనక్కి ఇచ్చి సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో బల్బులు తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. గరిష్టంగా ఐదు బల్బులను ఎక్స్ ఛేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.
10 రూపాయల బల్బు అంటే చౌక బల్బులు అని భావించాల్సిన అవసరం లేదు. ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల కరెంట్ బిల్లును సులభంగా తగ్గించుకోవచ్చు. ఎక్కువ రోజులు మన్నిక వచ్చే ఈ బల్బులను మనం తీసుకుంటే మంచిది.