రాములమ్మ పోతే పోనీ.. కాంగ్రెస్ లైట్

బుజ్జగించింది. బతిమిలింది.. బామాలింది.. చివరకు విజయశాంతిని కాంగ్రెస్ వదిలేసింది. పార్టీలో తనకంటే ప్రాముఖ్యత కావాలని విజయశాంతి.. తాము బాగానే చూసుకున్నామని కాంగ్రెస్ వాదిస్తోంది. కానీ విజయశాంతి మనసు మాత్రం బీజేపీ వైపే లాగుతోంది. ఎంత బతిమిలాడినా విజయశాంతి ఇక మారదని తెలిసి.. ఆమె బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు అడ్డుకోవద్దని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. Also Read: దుబ్బాకలో పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌ విజయశాంతిది నిలకడలేని మనస్తత్వం అని .. ఆమెతో పెద్దగా తమకు ఉపయోగం […]

Written By: NARESH, Updated On : November 10, 2020 3:24 pm
Follow us on

బుజ్జగించింది. బతిమిలింది.. బామాలింది.. చివరకు విజయశాంతిని కాంగ్రెస్ వదిలేసింది. పార్టీలో తనకంటే ప్రాముఖ్యత కావాలని విజయశాంతి.. తాము బాగానే చూసుకున్నామని కాంగ్రెస్ వాదిస్తోంది. కానీ విజయశాంతి మనసు మాత్రం బీజేపీ వైపే లాగుతోంది. ఎంత బతిమిలాడినా విజయశాంతి ఇక మారదని తెలిసి.. ఆమె బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు అడ్డుకోవద్దని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Also Read: దుబ్బాకలో పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌

విజయశాంతిది నిలకడలేని మనస్తత్వం అని .. ఆమెతో పెద్దగా తమకు ఉపయోగం లేదని కాంగ్రెస్ దాదాపు నిర్ణయానికి వచ్చింది.. మెదక్ జిల్లాలో ప్రభావం చూపే స్థాయిలో విజయశాంతి లేదని.. ఆమె ఉన్నా.. పోయినా పెద్దగా తేడా లేదని కాంగ్రెస్ అధిష్టానం మౌనంగా ఉంటుందోట.. అందుకే విజయశాంతి పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నా పెద్దగా కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదని తెలుస్తోంది.

Also Read: దుబ్బాకలో రౌండ్‌ రౌండ్‌కూ ఉత్కంఠ

బీజేపీలోకి వెళ్తారనే వార్తలు రావడంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇటీవలే విజయశాంతిని సముదాయించేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్‌‌ను రంగంలోకి దింపింది. పార్టీ ఆదేశాల మేరకు కుసుమ కుమార్‌‌ నేరుగా విజయశాంతి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ.. ఆ చర్చలతో కూడా పెద్దగా లాభం లేదని కాంగ్రెస్‌ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆమె కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్టీ మారే వార్తలను ఖండించలేదు. దీంతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సంప్రదింపుల అంశానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టారట. విజయశాంతి విషయంలో లైట్‌ తీసుకుందామని డిసైడ్‌ అయ్యారట.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ.. స్థిరంగా ఒక పార్టీలో ఉండరనేది ప్రధాన టాక్‌. 1998లో బీజేపీతో రాజకీయాల్లోకి వచ్చారు. రెండు దశాబ్దాల పొలిటికట్‌ కెరియర్‌‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్‌‌పర్సన్‌గా ప్రస్తుతం ఉన్నారు. ఇటీవల ఆమె మళ్లీ కాషాయం గూటికి చేరుతున్నారని తెలవడంతో ఇక ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యిందట..