Heavy Rains: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య స్టేట్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సెప్టంబర్ 6-7 తేదీల్లో అల్పపీడన ప్రాంతం లేదా దాని అవశేష తుపాను ప్రసరణ పశ్చిమ-వాయువ్య దిశ ప్రభావంతో దక్షిణ ఒడిశా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్బ, దక్షిణ చత్తీస్ గఢ్ లో చాలా వరకు విస్తారమైన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర మరఠ్వాడ, ఉత్తర మధ్య మహారాష్ర్ట, ఉత్తర కంకణ్, గుజరాత్ ప్రాంతం సెప్టెంబర్ 7-9 మధ్య వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. సెప్లెంబర్ 7-8 మధ్య ఉత్తర కొంకణ్ లో, సెప్టెంబర్ 8న మధ్య మహారాష్ర్ట, గుజరాత్ ప్రాంతాలలో సెప్టెంబర్ 7న తెలంగాణలో కూడా భారీ వర్షపాతాలు నమోదు కానున్నాయి. సెప్టెంబర్ 7-9 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, జమ్మూ ప్రాంతం, తూర్పు రాజస్తాన్ లలో భారీ వర్షాలు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
సెప్టెంబర్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశముంది. భారత వాతావరణ శాఖ ఆగస్టు 31 వరకు వర్షపాతం లోటు 9 శాతం ఉండగా సెప్టెంబర్ 5 వరకు లోటు తొమ్మిది శాతానికి తగ్గింది. ఆగస్టులో నమోదైన లోటు ప్రస్తుత నెలలో అధిక వర్షపాతం కురుస్తుందని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అంచనాలున్నట్లు తెలుస్తోంది.
రానున్న 48 గంటల్లో దక్షిణ కంకణ్, గోవాలో రుతుపవనాల కార్యకలాపాలు బలపడవచ్చని తెలిపారు. ఉత్తర భారతంలో మధ్య బంగాళాఖాతం చుట్టూ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6,7న గోవా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం ఏర్పడుతోంది. గోవా జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి ఒక వారం పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.