
India Vs England 4th Test: England lost 6 wickets .. Team India on the verge of victory: ఇంగ్లండ్ లో టీమిండియా మరో అద్భుతం చేసేందుకు రెడీ అయ్యింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో చివరి రోజు నాటకీయ పరిణామాలు సాగుతున్నాయి. టీమిండియా నిర్ధేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు షాకుల మీద షాకులు ఇచ్చారు బౌలర్లు. బౌలర్ల విజృంభణతో ఇప్పుడు ఓటమిని తప్పించుకోవడానికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పోరాడుతున్నారు.
తొలి సెషన్ లో అస్సలు వికెట్లు ఇవ్వకుండా సతాయించారు ఇంగ్లండ్ ఓపెనర్లు.. లంచ్ తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది.. నాలుగో టెస్టులో భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో రోజు తొలి సెషన్ లో ఇంగ్లండ్ 27 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 54 పరుగులు సాధించి కేవలం రెండు వికెట్లు మాత్రమేకోల్పోయింది. బ్యాట్స్ మెన్ పట్టుదలగా ఆడారు. కానీ లంచ్ తర్వాత పరిస్థితి మారింది. బుమ్రా వరుసగా ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసి భారత్ విజయానికి పునాది వేశాడు. ఆ తర్వాత జడేజా వికెట్ల పతనం ప్రారంభించాడు.
ఇంగ్లండ్ ఓపెనర్లు బర్న్స్ 50, హమీద్ 2 పరుగులతో వికెట్లను అడ్డుకున్నారు. అనంతరం వారిద్దరూ ఔట్ కావడంతో ఇంగ్లండ్ టపటపా వికెట్లు కోల్పోయింది. పోప్, బెయిర్ స్టోను బుమ్రా ఔట్ చేయగా.. మెయిన్ అలీని జడేజా ఔట్ చేశాడు.
ప్రస్తుతం ఆట ఇంకా 50ఓవరకు పైగా మిగిలి ఉంది. ఇంగ్లండ్ విజయానికి 220 పరుగులకు పైగా కావాలి.. సో భారత్ విజయం ఖాయం అన్న అంచనాలు నెలకొన్నాయి.