Pensions: ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పింఛన్లు తగ్గిస్తున్నారు. అనర్హుల పేరుతో పలువురి పేర్లు తొలగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లు ఇచ్చినా ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అర్హులకే పింఛన్లు ఇస్తామంటూ ప్రకటిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పింఛన్ల బాగోతం వైరల్ గా మారుతోంది. ప్రభుత్వం మాత్రం అనర్హులకు కూడా పింఛన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది. మొత్తానికి పింఛన్లు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరిలో ఆందోళన కలుగుతోంది.
ఏ ఆసరా లేని వారికి పింఛన్లు ఇస్తారు. లబ్ధిదారుల సంఖ్య 60 లక్షల వరకు ఉంది. దీంతో ప్రభుత్వంపై పెను భారం పడుతోంది. దీంతో భారం తగ్గించుకునే క్రమంలో వైసీపీ సర్కారు అడుగులు వేస్తోంది. జూన్ నెలలో గరిష్టంగా 61 లక్షల 48 వేల మందికి పింఛన్లు అందజేస్తున్నారు. జులై నెలలో ఈ సంఖ్య 60 లక్షల 95 వేల మందికి తగ్గిపోయింది. ఆగస్టులో 60 లక్షల 50 వేల మందికే పంపిణీ చేశారు. అర్హుల సంఖ్య 59 లక్షల 18 వేలుగా గుర్తించారు. మిగిలిన వారందరికి పింఛన్లు తీసేశారు.
ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉండడంతో ఒకరికే పింఛన్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఉంటే వారికి కూడా పింఛన్ తొలగించారు. దీంతో పింఛన్ దారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నిబంధనల ప్రకారం చూస్తే పింఛన్ అర్హులకు న్యాయం చేసే క్రమంలో అనర్హులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
సీఎం జగన్ మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ల వయసు 60కి తగ్గించేశారు. పింఛన్ డబ్బులు రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. కానీ ప్రతి ఏడాది రూ.250 పెంచుతామని భరోసా కల్పించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్కసారే పింఛన్ పెంచారు. కానీ ఇంతవరకు పెంచింది లేదు. జనవరి నుంచి పెంచుతామని జాబ్ క్యాలెండర్ లో ప్రకటించినా ఇంతవరకు ఆచరణ మాత్రం దక్కడం లేదు.