Kuppam: కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట.. ఆయన సొంత నియోజకవర్గం.. 40 ఏళ్ల పాలిటిక్స్ ను చంద్రబాబును వరుసగా గెలిపించి నిలబెట్టిన ప్రాంతం. అలాంటి చోట చంద్రబాబు, టీడీపీ నేతలను చెడుగుడు ఆడేస్తోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. చంద్రబాబు వచ్చాడని వైసీపీ శ్రేణులు ‘అన్న క్యాంటీన్’ఫై దాడి చేయడం.. దానికి ప్రతిగా చంద్రబాబు రోడ్డుపై భైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కానీ ట్విస్ట్ ఏంటంటే రివర్స్ లో వైసీపీ ప్రభుత్వం టీడీపీ వారిపైనే కేసులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం ఈ అసలు వివాదానికి కారణం. పోటీగా టీడీపీ నేతలు రెచ్చిపోయి వైసీపీ వారితో పోట్లాడారు. అయితే ఒకసైడే కేసులు నమోదు కావడం విశేషం.
రామకుప్పం మండలంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు పెట్టి చంద్రబాబుకు షాకిచ్చారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు 143, 147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసు నమోదు పెట్టారు. మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆయన ముందే టీడీపీ నేతలపై, బాబుగారిపై దాడులు చేస్తారా? అని బాబు గారు నడిరోడ్డుపై ధర్నా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దెబ్బతో బాబుగారు వైసీపీ ప్రభుత్వంపై ధర్మపోరాటానికి రెడీ అయిపోయారు. నడిరోడ్డుపై బాబుగారిని చూసి చంద్రబాబుకు ఎంత కష్టమొచ్చే అని టీడీపీ నేతలు వాపోతున్నారు.
Also Read:Sonali Phogat : సోనాలి ఫోగట్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. హత్య కేసు నమోదు
[…] […]
[…] […]