Tejaswi Madivada: బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మాదివాడ కౌశల్ ఆర్పీపై సంచలన ఆరోపణలు చేశాడు. హౌస్ లో ఉన్నప్పుడు బయటికి వచ్చాక కౌశల్ తో పాటు ఆయన అభిమానుల కారణంగా ఇబ్బందులు పడ్డట్లు తేజస్వి అసహనం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి మానసిక వేదనకు గురయ్యారట. ఆమె మాట్లాడుతూ… కౌశల్ ఆర్మీ చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక రెండేళ్లు ఇండస్ట్రీకి దూరమైపోయాను. ఆ సమయంలో ముందుకు అలవాటు పడ్డాను. బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యాను. అయితే ఏవరో ఏదో అన్నారని నేను కెరీర్ వదిలేయడమేంటని తిరిగి వచ్చాను.

ఒకరిని అంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది. కౌశల్ కూడా బాగుపడింది ఏమీ లేదు కదా. ఆయన కెరీర్ కూడా అంతంత మాత్రమే అన్న కోణంలో తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు. చివరికి హోస్ట్ నాని సైతం తననే టార్గెట్ చేశారని ఆమె వాపోవడం కొస మెరుపు. బిగ్ బాస్ సీజన్ 2 లో తేజస్వి పాల్గొన్నారు. హౌస్ లో హాట్ హాట్ డ్రెస్సులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వివాదాలు ఎక్కువ కావడంతో ఆమె గేమ్ నచ్చక ఆడియన్స్ ఆరు వారాలకే ఇంటికి పంపేశారు. నిజానికి ఆమె ఫైనల్ కి వెళతారని అందరూ భావించారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ మందా నిలిచాడు. ఫైనల్ లో అతడు సింగర్ గీతా మాధురిని ఓడించాడు.

గతంతో పోల్చితే తేజస్వి బిగ్ బాస్ షో కారణంగా ఫేమస్ అయ్యారు. ఇటీవల హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ లో సైతం అమ్మడుకి నిరాశే ఎదురైంది. త్వరగానే ఆమె హౌస్ ని వీడారు. మరలా అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ కి వెళతానని తేజస్వి అంటున్నారు. 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో వెండితెరకు పరిచయమైన తేజస్వి, ఐస్ క్రీమ్ మూవీలో బోల్డ్ రోల్ చేశారు. ఆమె లేటెస్ట్ మూవీ కమిట్మెంట్ ఇటీవల విడుదలైంది.
Also Read:Sonali Phogat : సోనాలి ఫోగట్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. హత్య కేసు నమోదు
[…] […]