Gandhi Hospital: మన శరీరంలో దేనికి ఆపరేషన్ చేయాలన్నా రోగికి మత్తు ఇచ్చి పడుకోబెట్టి వైద్యులు పూర్తి చేస్తారు. ఆ నొప్పి, బాధ తెలియకూడదనే ఈ పనిచేస్తారు. కానీ మెదడుకు ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రం సృహలోనే ఉండాలి. అలా లేకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం. అందుకే మెదడుకు సంబంధించిన ఆపరేషన్లలో రోగిని మెలకువగా ఉంచేందుకు వైద్యులు ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అలాంటి అద్భుతాన్నే చేశారు.

ఓ మహిళ మెదడులోని కణుతులను ఆమెకు సినిమాచూపిస్తూ.. ఆమెతో మాట్లాడుతూ చాలా ఈజీగా తీసేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ 50 ఏళ్ల మమిళ(50) అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమె మెదడులో కణుతులను గుర్తించారు. నిన్న ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసిన వైద్యులు ఆమెకు అనస్థీషియా మత్తు మందు ఇవ్వకుండానే ఆపరేషన్ మొదలుపెట్టారు. స్మార్ట్ ఫోన్ లో ఆమెకు సినిమా చూపించి ఆపరేషన్ ప్రారంభించారు. మధ్య మధ్యలో ఆమెతో మాట్లాడుతూ ఆమెకు అభిమాన హీరోల గురించి తెలుసుకుంటూ ఆపరేషన్ పూర్తి చేశారు.
Also Read:Kuppam: కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు… చంద్రబాబుకు ఎంత కష్టమొచ్చే?

ఆపరేషన్ జరుగుతుందన్న ఊహే ఆమెకు రానీయకుండా చేసి మెదడులోని కణతులను విజయవంతంగా తొలగించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
Also Read:Tejaswi Madivada: కౌశల్ ఆర్మీ టార్చర్ తట్టుకోలేక మందుకు అలవాటు పడ్డాను… పూర్తిగా షేప్ అవుట్ అయ్యాను
[…] Also Read: Gandhi Hospital: మత్తు ఇవ్వకుండానే స్మార్ట్ఫో… […]