కోవిడ్ దోపిడీ: ప్రైవేటు ఆస్పత్రులపై కేసీఆర్ కొరఢా

కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతా దృక్పథంలో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచెవిన పెట్టి కొవిడ్ చికిత్సకు ఇష్టానుసారం అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న పలు ప్రైవేటు ఆస్పత్రుపై ప్రభుత్వం తాజాగా కొరడా ఝళిపించింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 64 ప్రైవేటు ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కరోనా బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై […]

Written By: Suresh, Updated On : May 28, 2021 9:55 pm
Follow us on

కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతా దృక్పథంలో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచెవిన పెట్టి కొవిడ్ చికిత్సకు ఇష్టానుసారం అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న పలు ప్రైవేటు ఆస్పత్రుపై ప్రభుత్వం తాజాగా కొరడా ఝళిపించింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 64 ప్రైవేటు ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

కరోనా బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. హైదరాబాద్ లో ఐదు ఆస్పత్రుల కోవిడ్ సేవల లైసెన్స్ ను ఆరోగ్యశాఖ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

బంజారాహిల్స్ లోని విరంచి ఆస్పత్రితోపాటు బేగం పేటలోని విన్ ఆస్పత్రి, కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రి, కేపీహెచ్.బీలోని మ్యాక్స్ హెల్త్, సనత్ నగర్ లోని నీలిమ ఆస్పత్రుల కోవిడ్ సేవల లైసెన్స్ లను రద్దు చేసింది.

తెలంగాణ ప్రజల నుంచి ఆస్పత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆస్పత్రులన్నీ రోగులను దోచుకుంటున్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.

ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మిగతా ఆస్పత్రులకు హెచ్చరికలు జారీ చేసింది.