https://oktelugu.com/

తెలంగాణలో టీడీపీ అభిమానుల కోసం షర్మిల ప్రణాళిక

తెలంగాణలో పట్టు కోసం షర్మిల ప్రయత్నిస్తున్నారు. తన ప్రభావాన్ని చూపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జనాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు క దుపుతున్నారు. కొద్ది రో జులుగా తెలంగాణలో పార్టీ ప్రతిష్ట పెంచుకునే పనిలో పడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో చంద్రబాబు లాంటి నేతలను పొగుడుతూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో టీడీపీ అభిమానులను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా జగన్ మాత్రం ఇరకాటంలో పడినట్లు అవుతోంది. […]

Written By: , Updated On : May 28, 2021 / 08:53 PM IST
Follow us on

Sharmila

తెలంగాణలో పట్టు కోసం షర్మిల ప్రయత్నిస్తున్నారు. తన ప్రభావాన్ని చూపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జనాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు క దుపుతున్నారు. కొద్ది రో జులుగా తెలంగాణలో పార్టీ ప్రతిష్ట పెంచుకునే పనిలో పడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో చంద్రబాబు లాంటి నేతలను పొగుడుతూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో టీడీపీ అభిమానులను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా జగన్ మాత్రం ఇరకాటంలో పడినట్లు అవుతోంది.

తెలంగాణలో ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతోనే రాష్ర్టం సుభిక్షంగా ఉందని గుర్తుచేసుకున్నారు. షర్మిల కావాలనే టీడీపీ అభిమానులకు ప్రత్యక్షంగా పొగుడుతూ ప్రకటనలు చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఉనికి కో ల్పోతున్న టీడీపీ వారిలో నిస్తేజం తొలగించి ఉత్సాహం నింపేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. షర్మిల మాటలు ఏపీ వైసీపీ నేతలకు కోపం తె ప్పిస్తున్నా ఆమె ప్రణాళిక వేరే ఉందని చెబుతున్నారు.

ఏపీలో వైసీపీకి ఇబ్బంది అవుతోంది. పార్టీ వ్యూహాలను అమలు చేయకూడదన్న ఆలోచనలో షర్మిల లేదు. పక్కా వ్యూహంతోనే చంద్రబాబు, ఎన్టీఆర్ లపై ప్రశంసలు చేస్తున్నారని చెబుతున్నారు. కరోనా కారణంగా షర్మిల ప్రత్యక్షంగా త పార్టీ ఏర్పాటు కార్యక్రమాలకు బ్రేక్ ఇచ్చారు. పార్టీ ఏర్పాటు తదనంతరం చేయాల్సిన వ్యవహారాలపై నిరంతరం పార్టీ నేతలతో చర్చిస్తూ వ్యూహాలు ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

మొత్తానికి తెలంగాణలో పాగా వేయాలి షర్మిల గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు కార్యోణ్ముఖులను చేయాలని భావిస్తున్నారు. దీంతో షర్మిల టీడీపీ అభిమానుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు.