Gorati venkanna
ప్రముఖ వాగ్గేయ కారుడు గోరటి వెంకటన్న ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నారా..? గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాబోతోందా..? గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకన్న పేరును టీఆర్‌ఎస్ పరిశీలిస్తోందా..? ఇటీవల వెంకన్న సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో అందుకే కలిశారా..? వీటన్నింటికి ఇప్పుడు టీఆర్‌ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
Also Read: హైదరాబాద్ ఖ్యాతి.. మరోసారి ఇనుమడించింది
తన మాటలు, పాటలు, రాతలతో ఆది నుంచీ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు గోరటి వెంకన్న. అంతకుముందు ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతోందో’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ పాద యాత్రలో ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది. రాష్ట్రం వచ్చి కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలో చేపట్టినా ఆయన ఏనాడూ పదవులు ఆశించలేదు. అలా అనీ ఏనాడూ కేసీఆర్ మీద కానీ, ఆయన ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేయలేదు.
ప్రగతి భవన్‌లో సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఒకటి, రెండు సమావేశాల్లోనే వెంకన్న పాల్గొన్నారు. ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం వెంకన్న పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి (సభావత్ రాములునాయక్) మార్చి 2న ఖాళీ కాగా, మరొకటి (నాయిని నర్సింహారెడ్డి) జూన్ 19న, ఇంకొకటి (కర్నె ప్రభాకర్) ఆగస్టు 17న ఖాళీ అయింది.
Also Read: ఇద్దరు సీఎంలను టార్గెట్ చేసిన కొండా సురేఖ
వీటిలో ఒకటి కర్నె ప్రభాకర్‌కు పక్కా అనే అభిప్రాయంతో పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప, సీనియర్ నేత నాయినిని నిరాశపర్చకపోవచ్చని చెబుతున్నారు. ఇక, మూడో స్థానం కోసం మొదటి నుంచీ మాజీ ఎంపీ సీతారాంనాయక్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ మూడు ఖాళీ స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.