మహానగరమైన మన హైదరాబాద్ విశ్వవ్యాప్త నగరంగా ఖ్యాతి సాధిస్తోంది. ఏటా ఎన్నో సర్వేలు, ర్యాంకింగ్స్‌లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్.. ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇప్పటికే సేఫియెస్ట్ జాబితాలోనూ చేరిన మన నగర శిఖలో మరో మణిహారం చేరింది. తాజాగా హాలిడిఫై.కామ్ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్ 1గా నిలిచింది.భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, సుస్థిరాభివృద్ధి కలిగిన, స్థిరమైన ఉపాధి కల్పించే నగరంగా అగ్ర స్థానంలో నిలిచినట్లు సర్వే వెల్లడించింది. అంతేకాదు, దక్షిణ భారతదేశ న్యూయార్క్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందుతోందని కితాబిచ్చింది.
Also Read: ఉద్యమకారులపై కేసీఆర్ ప్రేమ..ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న..?
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరాభివృద్ధి తదితర అంశాల ప్రాతిపదికన చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్‌కు 5 పాయింట్లకు గాను 4 పాయింట్లు లభించినట్లు తెలిపింది. దేశంలోని మిగతా మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాలను సైతం వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం.
సెప్టెంబర్ నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటనకు అనువైన కాలమని సర్వేలో వెల్లడించారు. అన్నిరకాల వ్యాపారాలకు, పరిశ్రమలకు అనువైన నగరమని పేర్కొంది. ఇక్కడి ప్రజలు, సంస్కృతి, వంటలు అందరినీ ఆకట్టుకుంటాయని సర్వే తెలిపింది. చారిత్రక చార్మినార్, గోల్కొండ కోటలతోపాటు అనేక గొప్ప ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చని చెప్పుకొచ్చింది.
Also Read: ఇద్దరు సీఎంలను టార్గెట్ చేసిన కొండా సురేఖ
గతంలో జేఎల్‌ఎల్(జోన్స్ ల్యాంగ్ లస్యాలే) సిటీ మొమెంటం ఇండెక్స్ 2020లోనూ ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంది. ఏటా మెర్సర్ సంస్థ నిర్వహించే సర్వేలోనూ వరుసగా ఐదేళ్లపాటు హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తూ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌కు దక్కిన గుర్తింపుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో కంగ్రాట్స్ చెప్పారు. కేటీఆర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.