తెలుగు రాష్ర్టాలకు తీపికబురు.. ముందస్తుగానే రుతుపవనాలు

తెలుగు రాష్ర్టాలకు తీపి కబురు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తున్నట్లు చెబుతున్నారు. ఐదు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకుతున్నట్లు వెల్లడించింది. దీంతో శనివారం నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు కేరళలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల చివరి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి […]

Written By: Srinivas, Updated On : May 21, 2021 9:38 am
Follow us on

తెలుగు రాష్ర్టాలకు తీపి కబురు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తున్నట్లు చెబుతున్నారు. ఐదు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకుతున్నట్లు వెల్లడించింది. దీంతో శనివారం నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు కేరళలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల చివరి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ర్టాల్లో విస్తరిస్తాయి. కర్ణాటక, లక్షద్వీప్ లపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని తేల్చింది.

తెలంగాణ, ఏపీలపై ప్రభావం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఏపీల్లో ముందస్తుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 21,22 తేదీల్లో కర్ణాటక, కేరళ, కోస్తా తీరాల్లో, దక్షిణ అంతర్గత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమ జిల్లాలపై కూడ ప్రభావం చూపుతుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని సూచించింది. అండమాన్ ఉత్తర సముద్ర ప్రాంతాన్ని ఆనుకుని వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది 24 నాటికి తుపాన్ గా మారుతుంది. దీనికి యాస్ తుపాన్ గ నామకరణం చేశారు.

ముందస్తు రుతుపవనాలతో..
ఈ సంవత్సరం ముందస్తుగా వస్తున్న రుతుపవనాలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం సైతం వర్షాలు ముందుగానే రావడంతో వ్యవసాయం లాభసాటిగా సాగింది. ఈ సంవత్సరం కూడా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని అందరూ ఆశిస్తున్నారు. వర్షాధారిత దేశం కావడంతో రైతులు వర్షాలనే నమ్ముకుని వ్యవసాయం చేస్తుంటారు. అందుకే వర్షాల కోసం ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం బాగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.