
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు- మవోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.