
మహిళల్లో చాలామంది గోర్లను పొడవుగా పెంచుకుంటారు. కొందరు స్టైల్ కోసం గోర్లను ఆ విధంగా పెంచుకుంటే మరి కొందరు మహిళలు గోర్లను ఇష్టంతో పెంచుకుంటూ ఉంటారు. అయితే పొడవైన గోర్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతుంటారు. గోర్లను శుభ్రంగా ఉంచుకోకపోతే విరేచనాలు, ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. పొడవుగా ఉండే గోర్లు ధూళిని కలిగి ఉండటంతో పాటు ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.
చేతి పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనేక వ్యాధులు, బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. గోళ్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేతులను ఎక్కడ పడితే అక్కడ ఉంచితే గోళ్లలోకి క్రిములు చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా గోర్లను సులభంగా శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది.
గోర్లను గోరువెచ్చని నీరు, సబ్బుతో ఎక్కువ సమయం కడగాలి. గ్రీజు వంటి ధూళి మధ్య పనిచేసే వాళ్లు చేతి తొడుగులు ధరించి పనులు చేయాలి. ప్రత్యేక క్లీనర్ సహాయంతో ఆ గోర్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. క్రమం తప్పకుండా గోర్లు కట్ చేస్తే ఆరోగ్యకరమైన గోర్లను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. చేతులు కడుక్కున్న ప్రతిసారి ఆ చేతులు పూర్తిగా ఆరేలా జారత్తలు తీసుకోవాలి.
తేమతో ఉన్న చేతులు క్రిములను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోర్లు కత్తరించే ముందు కట్టర్లను శుభ్రం చేస్తే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చేతి గోళ్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గుతాయి.