https://oktelugu.com/

‘వైసీపీ’ గుర్తుపై హైకోర్టు సంచలన తీర్పు

ఏపీలో వైఎస్ జగన్ సారధ్యంలో రాష్ర్టంలో అధికారంలో ఉన్నవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు బిగ్ షాట్ తగిలింది. వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేతకు గురైంది. ఈ పిటిషన్ అసంబద్ధమైనదిగా పేర్కొంది. న్యాయస్థానం దీన్ని కొట్టివేసినట్లు తెలిపింది. దీంతో అధికార పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ర్టంలో అధికారంలో ఉన్నయువజన,శ్రామిక,రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) పేరు తమ పార్టీని పోలి ఉందంటూ అన్నా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 4, 2021 6:03 pm
    Follow us on

    ఏపీలో వైఎస్ జగన్ సారధ్యంలో రాష్ర్టంలో అధికారంలో ఉన్నవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు బిగ్ షాట్ తగిలింది. వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేతకు గురైంది. ఈ పిటిషన్ అసంబద్ధమైనదిగా పేర్కొంది. న్యాయస్థానం దీన్ని కొట్టివేసినట్లు తెలిపింది. దీంతో అధికార పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

    రాష్ర్టంలో అధికారంలో ఉన్నయువజన,శ్రామిక,రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) పేరు తమ పార్టీని పోలి ఉందంటూ అన్నా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో వైఎస్సార్ సీపీ గుర్తింపును రద్దుచేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ లో ఈ పిటిషన్ దాఖలైంది. ఏడాదికి పైగా విచారణ సాగింది. దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది ఈ పిటిషన్ పై విచారణ తాజాగా కొద్దిసేపటి కిందటే ఢిల్లీ హైకోర్టు తన తుది తీర్పు వెలువరిచింది.

    ఈమేరకు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్ తీర్పు ఇచ్చారు. ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ పేరు వాడటానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికి ఆ పార్టీ పట్టించుకోలేదని దాని గుర్తింపును రద్దు చేయాలంటూ బాషా పిటిషన్ వేశారు. వైసీపీ తమ అన్నా వైసీపీలో ఒక భాగంగా గుర్తించాలని కోరారు.

    ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్ అండ్ అలాట్ మెంట్) లోని పేరా 16ఏ కింద వైసీపీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు.వైసీపీ ఎన్నికల గుర్తును రద్దు చేయడంతో పాటు ఆపార్టీ పేరును మరొకరు వినియోగించకుండా చర్యలు చేపట్టాలని మహబూబ్ బాషా తన పిటిషన్ లో న్యాయస్థానానికి అభ్యర్థించారు. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.