https://oktelugu.com/

చరణ్ కోసం ‘కేజీఎఫ్’ డైరెక్టర్ తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత !

‘కేజీఎఫ్’.. ఇది సినిమా కాదు, షార్ప్ టేకింగ్ కి, టైట్ స్క్రీన్ ప్లేకి మధ్య జరిగిన సంఘర్షణ మయం. ప్రతి సీన్ ను ఎమోషన్బ్ తో డ్రైవ్ చేస్తూ.. ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం.. పైగా పదికి పైగా యాక్షన్ సీక్వెన్సెస్ ను పెట్టడం అంటే.. మాటలు కాదు. కానీ, ప్రశాంత్ నీల్ సాధించి చూపించాడు. అందుకే ఒక్క సినిమాతోనే నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఫుల్ డిమాండ్ ను […]

Written By:
  • admin
  • , Updated On : June 4, 2021 / 03:44 PM IST
    Follow us on

    ‘కేజీఎఫ్’.. ఇది సినిమా కాదు, షార్ప్ టేకింగ్ కి, టైట్ స్క్రీన్ ప్లేకి మధ్య జరిగిన సంఘర్షణ మయం. ప్రతి సీన్ ను ఎమోషన్బ్ తో డ్రైవ్ చేస్తూ.. ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం.. పైగా పదికి పైగా యాక్షన్ సీక్వెన్సెస్ ను పెట్టడం అంటే.. మాటలు కాదు. కానీ, ప్రశాంత్ నీల్ సాధించి చూపించాడు. అందుకే ఒక్క సినిమాతోనే నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఫుల్ డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

    ఈ సినిమాతో ఏవరేజ్ హీరోగా ఉన్న యష్ కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. అందుకే, ప్రస్తుతం వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘కేజీఎఫ్ 2’ కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మరోపక్క నిర్మాతలు మాత్రం ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఎగబడి అడ్వాన్స్ లు ఇస్తున్నారు.

    భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ప్రశాంత్ నీల్ కి అడ్వాన్స్ ఇచ్చాడు. భారీ డైరెక్టర్స్ ను లాక్ చేయడంలో దానయ్య ఆరితేరిపోయాడు. రాజమౌళి లాంటి డైరెక్టర్ తోనే ఏ నిర్మాత చేయలేనంత భారీ సినిమా చేస్తూ.. ఇప్పుడు మరో పాన్ ఇండియా డైరెక్టర్ ను లైన్ లో పెట్టాడు. కాగా ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు దానయ్య.

    ఆ పోస్టర్ ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేయడం చూస్తుంటే.. ప్రశాంత్ నీల్ ఈ బ్యానర్ లో త్వరలోనే సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా ‘మీ కాంబోలో వచ్చే సినిమాలో హీరోని ఫైనల్ చేశారా? లేదా ?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కోసమే, దానయ్య ప్రశాంత్ నీల్ ను లాక్ చేశాడని తెలుస్తోంది.

    కాగా, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తోన్న ‘సలార్’ సినిమా తరువాత ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. ఆ తర్వాత దానయ్య బ్యానర్ లో చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది.