హరీశ్ రావు స్కెచ్: ఈటలకు చెక్ పెట్టేందుకు రెడీ?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ శాసనసభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఈటల హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం, కేసీఆర్, కేటీఆర్, కవిత, అల్లుడు హరీశ్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తనకు విభేదాలు ఐదేళ్ల క్రితమే వచ్చాయని చెప్పారు. ఈటల రాజీనామాతో త్వరలో హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరగనుంది. కేసీఆర్ […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 4:00 pm
Follow us on

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ శాసనసభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఈటల హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం, కేసీఆర్, కేటీఆర్, కవిత, అల్లుడు హరీశ్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తనకు విభేదాలు ఐదేళ్ల క్రితమే వచ్చాయని చెప్పారు. ఈటల రాజీనామాతో త్వరలో హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరగనుంది.

కేసీఆర్ కు ఈటలకు ఒకప్పుడు సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాత్రికి రాత్రే మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో ఈటల కేసీఆర్ పై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈటల రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.

హుజురాబాద్ నియోజకవర్గంపై మంత్రి హరీశ్ రావు ప్రత్యేక నజర్ పెట్టారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసినట్లు సమాచారం. హరీశ్ రావు ఫోకస్ పెట్టిన చోట్ల పార్టీ విజయాలే నమోదయ్యాయి. ఒక్క దుబ్బాకలో మాత్రం ఫలితం తారుమారైంది. గతంలో కొండాసురేఖపై భిక్షపతి గెలిచిన సమయంలో కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లోో రేవంత్ రెడ్డిని ఓడించడంలో కానీ హరీశ్ రావు స్కెచ్ వర్కౌట్ అయింది. హుజురాబాద్ నియోజకవర్గ బాధ్యతలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ నియోజకవర్గం కోసం టీఆర్ఎస్ అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయ. గతంలో కూడా పలు విద్యార్థి సంఘం నాయకులకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న చరిత్ర టీఆర్ఎస్ కు ఉంది. ఈటల రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నికలో హరీశ్ రావు వ్యూహాలకు పదును పెట్టాలని భావిస్తోంది.