వాహన యజమానులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..!

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా నెల రోజులపాటు సరుకు రవాణా లేకపోవడంతో లారీలు నిలిచిపోయాయి. దీంతో లారీ యజమానులు తీవ్రంగా నష్టపోయారు ప్రస్తుతం వాహన పన్ను చెల్లించాల్సిన సమయంలో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే దీన్ని మూడు […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 2:38 pm
Follow us on


రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా నెల రోజులపాటు సరుకు రవాణా లేకపోవడంతో లారీలు నిలిచిపోయాయి. దీంతో లారీ యజమానులు తీవ్రంగా నష్టపోయారు ప్రస్తుతం వాహన పన్ను చెల్లించాల్సిన సమయంలో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే దీన్ని మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా పోకడతో కాపుసారా పడగ!

లాక్‌డౌన్‌తో ప్రజలకు ఆదాయం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వాస్తవానికి వెహికల్ పన్నును అడ్వాన్స్‌గా చెల్లిస్తారు. ప్రతీ త్రైమాసికానికి చెల్లింపులు ఉంటాయి. ఒకవేళ సక్రమంగా ట్యాక్స్ చెల్లించకపోతే 50 శాతం నుంచి 200 శాతం వరకూ జరిమానాలు ఉంటాయి. అయితే ప్రభుత్వం గడువును పొడిగిస్తూ కొంచెం ఊరటను కల్పించింది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నెలకొనడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి. దీంతో ట్యాక్ష్ చెల్లింపుల విషయంలో వెలుసుబాటును కల్పించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై లారీ యజమానుల సంఘము నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.