https://oktelugu.com/

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఎన్నో రోజులుగా వారికి అందని ద్రాక్షగా మారి.. కేసీఆర్ ఇన్నాళ్లుగా జాప్యం చేసిన పీఆర్సీ కి ఎట్టకేలకు ప్రకటిద్దామనుకున్న వేళ నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పీఆర్సీ అనౌన్స్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2021 / 05:42 PM IST
    Follow us on

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఎన్నో రోజులుగా వారికి అందని ద్రాక్షగా మారి.. కేసీఆర్ ఇన్నాళ్లుగా జాప్యం చేసిన పీఆర్సీ కి ఎట్టకేలకు ప్రకటిద్దామనుకున్న వేళ నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో అనుకోని అవాంతరం ఎదురైంది.

    అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పీఆర్సీ అనౌన్స్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ పీఆర్సీ ఇస్తానని ఉద్యోగులకు మాట ఇచ్చాడు. అన్నట్టుగానే పీఆర్సీ ప్రకటన కోసం టీఆర్ఎస్ గెలవడంతో ఇప్పుడు ఈసీ అనుమతి కోరింది తెలంగాణ సర్కార్. దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చింది.

    అయితే ఎన్నికల్లో ఈ అంశంపై లబ్ధి పొందే ప్రయత్నాలు ఏమాత్రం చేయవద్దని ఈసీ సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినట్టు ఎన్నికల్లో ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది.

    ఇక రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ఉద్యోగుల అన్ని సమస్యలపై ప్రకటన చేస్తారని.. పీఆర్సీని కూడా ప్రకటిస్తారని అంటున్నారు. దీంతో ఉద్యోగుల్లో జోష్ నెలకొంది.