
వకీల్ సాబ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి మూడేళ్ల తర్వాత చేస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం టాలీవుడ్ తోపాటు ఆయన ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ , సంగీత దర్శకుడు తమన్ తాజాగా సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో వకీల్ సాబ్ సినిమా గురించి ఆసక్తికరంగా స్పందించారు.
‘పింక్’ రిమేక్ అనుకోగానే మొదట ఈ సినిమాకు ‘మగువ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట.. ఆ తర్వాత పవర్ స్టార్ ని దృష్టిలో ఉంచుకొని వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు.
మగువా పాటకు రామజోగయ్య అందించిన లిరిక్స్ అత్యద్భుతంగా ఉన్నాయని.. సాధారణమైన భాషలో ఈ పాట రాశారని దర్శకుడు వేణు శ్రీరామ్ అభినందించారు. ఈ పాట వినగానే కన్నీళ్లు వచ్చేశాయన్నారు. ఇలా వకీల్ సాబ్ సినిమాకు ముందు అసలు టైటిల్ ‘మగువ’ అని సీక్రెట్ ను బయటపెట్టాడు దర్శకుడు.