Homeఆంధ్రప్రదేశ్‌TTD: భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ఇక వసతి సమస్య ఉండదు

TTD: భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ఇక వసతి సమస్య ఉండదు

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదం, బస తదితర సౌకర్యాలను కల్పించనున్నారు.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. భక్తులకు మరింత మెరుగైన వస్తువులు కల్పించేందుకు టిటిడి డిసైడ్ అయ్యింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. వీరికి మరింత సౌకర్యవంతంగా వసతి కల్పించేందుకు టీటీడీ అచ్యుతం, శ్రీ పథం వసతి సముదాయాలను నిర్మిస్తోంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి, కోదండ రామస్వామి సత్రాల స్థానంలో ఈ రెండు వసతి సముదాయాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదం, బస తదితర సౌకర్యాలను కల్పించనున్నారు. అటు విశ్రాంతి గృహాలను సైతం ఆధునీకరిస్తున్నారు. ఏడు దశాబ్దాల కిందట నిర్మించిన గోవిందరాజు స్వామి సత్రం స్థానంలో రూ.209 కోట్లతో అచ్యుతం, కోదండరామ స్వామి సత్రం స్థానంలో రూ.209 కోట్లతో శ్రీ పథం వసతి సముదాయాలు నిర్మించాలని టిటిడి నిర్ణయించుకుంది.

ఒక్కో బ్లాక్ లో 41 వేల మంది చొప్పున బస చేసే వీలుగా ఈ సముదాయాలను నిర్మించనున్నారు. దాదాపు 200 వరకు వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా ప్లాన్ చేశారు. ఒక్కో బ్లాక్ ను 7.04 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 ఫ్లోర్లతో నిర్మిస్తున్నారు. మొదటి ఫ్లోర్లో రిసెప్షన్, టోకెన్ కౌంటర్లు, మహిళలు, పురుషులకు వేరువేరుగా జనరల్ టాయిలెట్లు, మెడికల్ డిస్పెన్సరీ, కార్యాలయ గదులు, రెండు రెస్టారెంట్లు, శ్రీవారి సేవకుల కోసం ఐదు హాళ్లు, స్టోర్ రూమ్ సైతం ఏర్పాటు చేస్తున్నారు.

రెండు, మూడు ఫ్లోర్లలో అన్న ప్రసాదం హాలు, 500 మంది యాత్రికులు బస చేసేందుకు వీలుగా 23 డార్మెటరీ హాళ్లు, జనరల్ టాయిలెట్లు నిర్మించనున్నారు. నాలుగో ఫ్లోర్ నుంచి ఎనిమిదో ఫ్లోర్ వరకు ఒక్క ఫ్లోర్లో ఎనిమిది ఫ్యామిలీ సూట్ రూములు, 100 గదులు చొప్పున నిర్మించనున్నారు. మూడు సంవత్సరాలలో ఈ నిర్మాణాలను పూర్తిచేసేందుకు టీటీడీ కృతనిశ్చయంతో ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper